World Cup 2023: భారత్‌లో మొదలైన ప్రపంచకప్ ఫీవర్.. వినూత్నంగా అంతరిక్షంలో ట్రోఫీ ఆవిష్కరణ
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని వినూత్న రీతిలో ఆవిష్కరించింది. ప్రత్యేక బెలూన్‌కు కట్టి భూమికి 1.20 లక్షల అడుగుల ఎత్తులో.. ట్రోఫీని లాంచ్ చేశారు. అనంతరం ట్రోఫీని ఫైనల్ మ్యాచ్‌కు వేదికైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ల్యాండ్ చేశారు. ఈ ఏడాది అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్‌లో వన్డే వరల్డ్‌కప్ జరగనుంది.
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని వినూత్న రీతిలో ఆవిష్కరించింది. ప్రత్యేక బెలూన్‌కు కట్టి భూమికి 1.20 లక్షల అడుగుల ఎత్తులో.. ట్రోఫీని లాంచ్ చేశారు. అనంతరం ట్రోఫీని ఫైనల్ మ్యాచ్‌కు వేదికైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ల్యాండ్ చేశారు. ఈ ఏడాది అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్‌లో వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. వరల్డ్‌కప్ ట్రోఫీ యాత్ర నేటి నుంచి కువైట్, బహ్రెయిన్, మలేసియా, అమెరికా, నైజీరియా, ఉగాండ, ఇటలీ, ఆతిథ్య భారత్ సహా 18 దేశాల్లో సాగుతుంది. సెప్టెంబరు 4న మళ్లీ భారత్‌కు చేరుకుంటుంది. క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ రిలీజ్ చేసింది. ముంబైలో ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ కార్యవర్గ సభ్యులు షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఇక వరల్డ్‌కప్ షెడ్యూల్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య వాగ్వాదం ముగిసింది. భారత్‌లో ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. ‘ఐసీసీ ప్రపంచ కప్ షెడ్యూల్ మంగళవారం ముగియనుంది. ముంబైలో ఐసీసీ మీటింగ్ ఉంది. పాకిస్తాన్ అనుకున్న షెడ్యూల్‌కు అంగీకరించింది. ఇక ఎటువంటి మార్పులు ఉండవు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే డ్రాఫ్ట్ షెడ్యూల్ లో ఉన్నట్లు గానే పాకిస్తాన్ మ్యాచ్ లు షెడ్యూల్ అయ్యాయి.
120,000 feet above the earth 🏆
The ICC Men’s @cricketworldcup Trophy Tour 2023 was launched in spectacular fashion 😍https://t.co/XSfej61OjS
— ICC (@ICC) June 27, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..