హర్మన్ జీ.. ఈ ముగ్గురే టీమిండియా పాలిట విలన్లు.. లైట్ తీసుకుంటే ట్రోఫీ మిస్సైనట్టే..!
Women’s Asia Cup 2026 Final: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ (Final)లో భారత మహిళల జట్టు (India Women), శ్రీలంక మహిళల జట్టు (Sri Lanka Women) తలపడనున్నాయి. సెప్టెంబర్ 13న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium)లో రాత్రి 8 గంటలకు జరిగే పోరులో భారత్ ఫేవరెట్ టీంగా బారిలోకి దిగనుంది.

Women’s Asia Cup 2026 Final: రేపు అంటే సెప్టెంబర్ 13న రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium)లో టైటిల్ పోరు మొదలవుతుంది. బంగ్లాదేశ్ (Bangladesh)పై 40 పరుగుల తేడాతో గెలిచిన భారత మహిళల జట్టు సెమీఫైనల్ (Semi-final) అడ్డంకిని దాటింది. పాకిస్థాన్ (Pakistan)ను నాలుగు వికెట్లతో ఓడించిన శ్రీలంక కూడా ఫైనల్ చేరింది. పేపర్‌పై భారత జట్టుకే ఆధిక్యం కనిపిస్తున్నా, శ్రీలంక విజయ ప్రయాణాన్ని తేలికగా తీసుకునే వీలు లేదు. పాకిస్థాన్‌పై ఒత్తిడిని జయించిన తీరు ఫైనల్‌లో ఆ జట్టు ఎంతటి ప్రతిఘటన ఇవ్వగలదో చూపించింది. ముఖ్యంగా చమరి అటపట్టు నేతృత్వంలోని లంక జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మ్యాచ్ దిశను మలుపుతిప్పగల ముగ్గురు కీలక ఆటగాళ్లను కలిగి ఉంది. వీరిలో ఒక్కనే చెలరేగిన టీమిండియాలో కష్టాలు తప్పవు. అందుకే ఈ పోరుకు ముందు శ్రీలంక బలాలను అంచనా వేయడం భారత్‌కు కీలకం.
భారత్‌పై అత్యంత జాగ్రత్తగా చూడాల్సిన పేరు చమరి అటపట్టు (Chamari Athapaththu). సీనియర్ ఆల్‌రౌండర్ అయిన ఆమె 30 టీ20 మ్యాచ్‌ల్లో 677 పరుగులు చేసింది. సగటు 23.34, స్ట్రైక్‌రేట్ 102.57గా ఉన్నాయి. 3 అర్ధశతకాలతో పాటు అజేయంగా 80 పరుగులు చేసిన రికార్డు కూడా ఉంది. బంతితోనూ ఆమె ప్రభావం తక్కువ కాదు. భారత్‌పై 20 ఇన్నింగ్స్‌ల్లో 13 వికెట్లు పడగొట్టింది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 2/21. ప్రస్తుత ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌లకే 11 వికెట్లు తీసి టాప్ బౌలర్లలో నిలిచింది. ఇందులో 7/5 ప్రదర్శన ప్రత్యేకం. బ్యాట్‌తో 63 పరుగులు చేసింది. పాకిస్థాన్‌పై సెమీఫైనల్లో కొత్త బంతితో వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసింది.
హర్షిత సమరవిక్రమ (Harshitha Samarawickrama) ముందంజలో లేకపోయినా, శ్రీలంక కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను నిలబెట్టగల సామర్థ్యాన్ని చూపించింది. ఈ టోర్నీలో 3 ఇన్నింగ్స్‌ల్లో 89 పరుగులు చేసిన ఆమె సగటు 44.50గా ఉంది. అజేయంగా 48 పరుగులు ఆమె అత్యధిక స్కోరు. స్ట్రైక్‌రేట్ 114.10 కావడం ఆమె కేవలం క్రీజులో నిలిచిపోలేదని చెబుతోంది. పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లో శ్రీలంక 33/4తో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కవిషా దిల్హారితో కలిసి 59 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యం నిర్మించింది. హర్షిత 31 బంతుల్లో 36 పరుగులు చేసి ఛేజ్‌కు ఊపిరి పోసింది.
కవిషా దిల్హారి (Kavisha Dilhari) మూడు ఇన్నింగ్స్‌ల్లో 42 పరుగులు చేసినా, ఆమె అసలు విలువ సెమీఫైనల్‌లో కనిపించింది. 33/4 పరిస్థితిలో హర్షితతో కలిసి నిలబడి, 33 బంతుల్లో 33 పరుగులు చేసింది. ఇద్దరూ కలిసి పాకిస్థాన్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు కదిలించారు. వికెట్ వెనుక భాగంలో పరుగులు రాబట్టిన తీరు కూడా ఆ భాగస్వామ్యానికి బలం ఇచ్చింది. బంతితోనూ దిల్హారి ఉపయోగపడుతోంది. స్పిన్ బౌలింగ్ ఎంపికగా ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు వికెట్లు తీసింది.
ఎక్కువమంది చదివినది: ఆసియా విజేతగా నిలిచినా.. ట్రోఫీతోపాటు ఒక్కపైసా దక్కదు.. ఎందుకో తెలుసా?
భారత జట్టు ఫేవరెట్ అయినా, అటపట్టును త్వరగా అదుపులోకి తీసుకోవడం, హర్షిత-దిల్హారి భాగస్వామ్యాలకు అవకాశం ఇవ్వకపోవడం కీలకం. శ్రీలంక ఈ ముగ్గురి ద్వారా బ్యాటింగ్‌లో పునర్నిర్మాణం, బౌలింగ్‌లో మిడిల్ ఓవర్లలో నియంత్రణ సాధిస్తోంది. అందుకే ఫైనల్‌లో భారత్ ఈ ముగ్గురిని అడ్డుకోవడం చాలా ముఖ్యం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




