Watch Video: కామన్వెల్త్ చరిత్రలో తొలిసారి లాన్ బౌల్‌లో పతకం సాధించిన భారత్.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టిన మహిళా అథ్లెట్లు..
CWG 2022: కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొలిసారి భారత్ ఓ ఈవెంట్ లో పతకం సాధించనుంది. అయితే, పతకం రంగు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. బంగారం గెలవాలని అంతా కోరుకుంటున్నారు.
కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత మహిళా అథ్లెట్లు అద్భుతాలు చేశారు. లాన్ బౌల్‌లో సోమవారం మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. లాన్ బౌల్ ఈవెంట్ నుంచి టీమిండియా ఎటువంటి పతకం ఆశలు లేకుండా బరిలోకి దిగింది. కానీ, భారత్ తన పతకాన్ని ఖారారు చేసుకుని సరికొత్త చరిత్ర నెలకొల్పింది. న్యూజిలాండ్ టీంతో హోరాహోరీ మ్యాచ్ లో గెలిచి, ఫైనల్ చేరుకుంది. ప్రస్తుతం స్వర్ణ పతకం కోసం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ చారిత్రాత్మక విజయంపై భారత జట్టుతో పాటు ప్రతి అభిమాని కూడా కంటతడి పెట్టారు. ఈ చారిత్రాత్మక విజయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పుడు ఆశలన్నీ బంగారంపైనే..
లవ్లీ చౌబే, పింకీ, నయన్మోని, రూపా టిర్కీలతో బరిలోకి దిగిన టీమిండియా.. ప్రస్తుతం భారత్‌కు బంగారు పతకం అందించి, చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఈ గేమ్‌లో భారత్‌కు పతకం రాలేదు. భారత్ పతకం రంగు ఇంకా ఖరారు కాలేదు. భారత జట్టు పతకాన్ని ఖాయం చేసుకున్న మ్యాచ్ లో గెలవగానే.. ఆ తర్వాత టీమ్ మొత్తం బోరున విలపించింది. ఈ క్రీడలో భారత్‌కు పతకం సాధించడం ఒక కల లాంటిది. జట్టు ఆటగాళ్ల పోరాటం కూడా ఇందులో తక్కువేమీ కాదు.
ధైర్యాన్ని విచ్ఛిన్నం చేయలేని గాయం..
చరిత్ర సృష్టించిన భారత జట్టు సభ్యురాలు నయన్మోని వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించాలనుకుంది. ఆమె వెయిట్ లిఫ్టింగ్ విషయంలో కూడా చాలా సీరియస్ గా ఉంది. కానీ, గాయం ఆమె వెయిట్ లిఫ్టింగ్ కెరీర్ ను ముగించింది. కాలి గాయం వల్ల దేశం తరపున వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించాలనే ఆమె కల ముగిసింది. కానీ, ఆమె స్ఫూర్తిని మాత్రం విచ్ఛిన్నం చేయలేకపోయింది. నయన్మోని తన ఆటను మార్చుకుని లాంగ్ బౌల్‌తో తిరిగి వచ్చింది. సోమవారం ఈ గేమ్‌లో తన కలను నెరవేర్చుకుంది.
Just in: India confirms another medal as Women Fours Lawn bowls team enter the final after beating NZ 16-13 in a thrilling semifinal. #Birmingham22 pic.twitter.com/9Otjyw9kpR
— Bhavya Chand (@bhavya_journo) August 1, 2022
అధిక వోల్టేజ్ పోటీ..
ఈ మ్యాచ్‌లో భారత్ 16-13తో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఒక దశలో 0-5తో ముందుకు వెళ్లిన తర్వాత భారత్ బలమైన పునరాగమనం చేసి 9వ లెగ్‌లో స్కోరును 7-7తో సమం చేసింది. తర్వాతి దశలో భారత్ ముందంజ వేసింది. 14వ లెగ్ తర్వాత న్యూజిలాండ్ జట్టు 13-12తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, రూపా రాణి కొట్టిన అద్భుతమైన షాట్‌తో భారత్ మ్యాచ్‌ను గెలుచుకుంది.