- Telugu News Photo Gallery Sports photos Cwg 2022 day 5 schedule lawn bowls gold medal badminton mixed final weightlifting match in telugu
CWG 2022 Day 5, Schedule: మరో నాలుగు స్వర్ణాలు లభించేనా.. ఐదో రోజు పతకాల లిస్టులో ఎవరున్నారంటే?
కామన్వెల్త్ క్రీడల ఐదో రోజు లాన్ బౌల్స్‌లో స్వర్ణ పతకం కోసం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఇంతకు ముందు కామన్వెల్త్‌లో లాన్ బౌల్స్‌లో భారత్ ఎలాంటి పతకం గెలవలేదు.
Updated on: Aug 01, 2022 | 8:37 PM

కామన్వెల్త్ గేమ్స్ 2022 5వ రోజున, లాన్ బౌల్స్‌లో భారతదేశం చరిత్ర సృష్టించాలని చూస్తోంది. అదే సమయంలో వెయిట్ లిఫ్టింగ్‌లో మరిన్ని పతకాల వర్షం కురిసే అవకాశం ఉంది. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ ఇప్పటి వరకు 3 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్య పతకాలు సాధించింది. దీంతో పాటు స్విమ్మింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, హాకీలో కూడా భారత్ బలంగా కనిపిస్తుంది.

కామన్వెల్త్ క్రీడల ఐదో రోజు లాన్ బౌల్స్‌లో స్వర్ణ పతకం కోసం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఇంతకు ముందు కామన్వెల్త్‌లో లాన్ బౌల్స్‌లో భారత్ ఎలాంటి పతకం గెలవలేదు. మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది.

వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ రాణిస్తోంది. మంగళవారం మహిళల 76 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్, పురుషుల 96 కేజీల్లో వికాస్ ఠాకూర్ ప్రదర్శన కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. పూనమ్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు, వికాస్ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది.

50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్‌లో భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సవాల్ చేయనున్నాడు. అదే సమయంలో, మధ్యాహ్నం 3 గంటలకు పురుషుల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్‌లో నటరాజ్ దిగనున్నాడు. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్ కూడా ఆడనుంది. అయితే అంతకంటే ముందు సింగపూర్‌ను భారత్ ఓడించాల్సి ఉంటుంది.

మధ్యాహ్నం 2.30 గంటలకు పురుషుల లాంగ్ జంప్ క్వాలిఫికేషన్ రౌండ్ ఏ, బీలో మురళీ శ్రీశంకర్, మహ్మద్ అనాస్ పోటీపడనున్నారు. బాక్సింగ్‌లో పురుషుల 75కిలోల పైబడిన విభాగంలో ఆశిష్ కుమార్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సవాల్ విసిరాడు. హాకీలో సాయంత్రం 6.30 గంటలకు జరిగే గ్రూప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది.




