CWG 2022: వెయిట్ లిఫ్టింగ్‌లో తిరుగులేని భారత్.. ఖాతాలో మరో పతకం.. కాంస్యంతో ఆకట్టుకున్న లవ్‌ప్రీత్ సింగ్..

Lovepreet Singh: 2019లో విశాఖపట్నంలో జరిగిన సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో లవ్‌ప్రీత్ డోపింగ్‌లో పట్టుబడ్డాడు. ఆ తర్వాత లవ్‌ప్రీత్‌ను సస్పెండ్ అయ్యాడు.

CWG 2022: వెయిట్ లిఫ్టింగ్‌లో తిరుగులేని భారత్.. ఖాతాలో మరో పతకం.. కాంస్యంతో ఆకట్టుకున్న లవ్‌ప్రీత్ సింగ్..
Cwg 2022 Lovepreet Singh
Follow us
Venkata Chari

|

Updated on: Aug 03, 2022 | 4:44 PM

కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు రాణిస్తూనే ఉన్నారు. బుధవారం జరిగిన 109 కేజీల కేటగిరీ మ్యాచ్‌లో లవ్‌ప్రీత్ సింగ్ తన సత్తా చాటాడు. లవ్‌ప్రీత్ 355 కిలోలు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మొత్తంగా భారత్ ఖాతాలో 14వ పతకం చేరింది. పంజాబ్‌కు చెందిన లవ్‌ప్రీత్ తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని అరంగేట్రంలోనే పతకాల ఖాతా తెరిచాడు. ఈ రోజు దేశం మొత్తం లవ్‌ప్రీత్ సింగ్‌కి సెల్యూట్ చేస్తోంది. కానీ, 2019 లో, ఏ అథ్లెట్‌కు తట్టుకోలేని అలాంటి సమయాన్ని అతను చవి చూశాడు. వాస్తవానికి 2019లో విశాఖపట్నంలో జరిగిన సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో లవ్‌ప్రీత్ డోపింగ్‌లో పట్టుబడ్డాడు. ఆ తర్వాత లవ్‌ప్రీత్‌ను సస్పెండ్ అయ్యాడు.

అయితే, 2021 సంవత్సరంలో ఈ ఆటగాడు తిరిగి వచ్చాడు. కామన్వెల్త్ సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ రజత పతకం సాధించాడు. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఈ పోటీలో లవ్‌ప్రీత్ 348 కిలోలు ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జూనియర్ కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్‌షిప్‌లో లవ్‌ప్రీత్ బంగారు పతకం సాధించాడు.

లవ్‌ప్రీత్ సింగ్ ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో తన సత్తా చాటడు. స్నాచ్‌లో 163 ​​కిలోలు ఎత్తాడు. అదే సమయంలో, క్లీన్ అండ్ జెర్క్‌లో ఈ ఆటగాడు అత్యధికంగా 192 కిలోల బరువును ఎత్తగలిగాడు. ఇలా ఈ ఆటగాడు మొత్తం 355 కిలోలు ఎత్తి పతకం సాధించాడు.

ఇవి కూడా చదవండి

లవ్‌ప్రీత్ సింగ్ ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాడు. ఈ ఆటగాడు పంజాబ్‌లోని అమృత్‌సర్ నివాసి. కేవలం 24 ఏళ్ల వయసులో ఈ ఆటగాడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో తన ఈవెంట్‌లో లవ్‌ప్రీత్ సిద్ధూ ముసేవాలాలా సంబరాలు చేసుకుంటూ కనిపించింది.