AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022 Boxing: సెమీ-ఫైనల్‌ చేరిన నీతూ.. బాక్సింగ్‌లో భారత్‌కు తొలిపతకం ఖాయం..

ఇప్పటి వరకు జరిగిన గేమ్స్‌లో భారత బాక్సర్లు బాగా రాణించారు. చాలా మంది బాక్సర్లు పతకాలకు ఒక్క అడుగు దూరంలో నిలిచారు.

CWG 2022 Boxing: సెమీ-ఫైనల్‌ చేరిన నీతూ.. బాక్సింగ్‌లో భారత్‌కు తొలిపతకం ఖాయం..
Cwg 2022 Boxer Nitu Ghanghas
Venkata Chari
|

Updated on: Aug 03, 2022 | 5:46 PM

Share

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాలు సాధించే వేగం రోజురోజుకు పెరుగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌, జూడో, టేబుల్‌ టెన్నిస్‌లలో పతకాల తర్వాత బాక్సింగ్‌లోనూ భారత్‌కు తొలి విజయం దక్కనుంది. తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న యువ బాక్సర్ నీతూ ఘంగాస్ బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన నికోల్ క్లాయిడ్‌ను ఓడించింది.

సెమీస్ చేరిన భారత మహిళల హాకీ జట్టు..

మరోవైపు కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 3-2తో కెనడాను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. భారత్ తరపున తొలి గోల్‌ను సలీమా టెటె చేయగా, రెండో గోల్‌ నవనీత్‌ కౌర్‌ చేసింది. అదే సమయంలో లాల్‌రేష్మియామి మూడో గోల్‌ చేసింది. అదే సమయంలో కెనడా తరఫున బ్రియాన్ స్టీయర్స్, హన్నా హ్యూన్ తొలి గోల్ చేశారు. గ్రూప్‌లో భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. 5-0తో ఘనాను, 3-1తో వేల్స్‌ను ఓడించారు. అదే సమయంలో ఇంగ్లండ్‌పై టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

కాంస్యం గెలిచిన లవ్‌ప్రీత్ సింగ్ ..

వెయిట్‌లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ 109 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. స్నాచ్‌లో 163 ​​కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 192 కిలోలు ఎత్తాడు. ఈ విధంగా 355 కేజీల బరువును ఎత్తి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

జూడో: ఫైనల్‌లో..

భారత జూడోకా తులికా మాన్ మహిళల 78+ కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో ఆమె 10-1తో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ ఆండ్రూస్‌ను ఓడించింది. అదే సమయంలో, దీనికి ముందు, ఆమె క్వార్టర్ ఫైనల్‌లో మారిషస్‌కు చెందిన ట్రేసీ డర్హోన్‌ను ఓడించింది.

నిఖత్-లవ్లీన్ సెమీ-ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్..

రాత్రి 10:30 నుంచి మహిళల బాక్సింగ్‌లో 48 కిలోల బరువు విభాగంలో నిఖత్ జరీన్, హెలెన్ జోన్స్ ఒకరితో ఒకరు తలపడతారు. అదే సమయంలో మధ్యాహ్నం 12:30 గంటలకు 70 కేజీల బాక్సింగ్ విభాగంలో లోవ్లినా బోర్గోహైన్, రోసీ ఎక్లెస్ మధ్య పోటీ ఉంటుంది.