బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా వసీం జాఫర్
ముంబయి : భారత మాజీ ఓపెనర్, రంజీ క్రికెటర్ వసీం జాఫర్ బంగ్లాదేశ్‌లోని హై పెర్ఫార్మెన్స్ క్రికెట్ అకాడమీ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. దీనికి సంబంధించి కొన్ని వారాల క్రితమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జాఫర్‌ను సంప్రదించింది. సంవత్సరంలో ఆరు నెలల పాటు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించేందుకు వసీంతో బంగ్లా బోర్డు ఒప్పందం కుదర్చుకుంది. దేశవాళీ క్రికెట్ ఆడుతూనే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా వసీం వ్యవహరించనున్నాడు. నలభై ఏళ్ల వసీం జాఫర్ ఇప్పటికీ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. […]

ముంబయి : భారత మాజీ ఓపెనర్, రంజీ క్రికెటర్ వసీం జాఫర్ బంగ్లాదేశ్‌లోని హై పెర్ఫార్మెన్స్ క్రికెట్ అకాడమీ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. దీనికి సంబంధించి కొన్ని వారాల క్రితమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జాఫర్‌ను సంప్రదించింది. సంవత్సరంలో ఆరు నెలల పాటు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించేందుకు వసీంతో బంగ్లా బోర్డు ఒప్పందం కుదర్చుకుంది. దేశవాళీ క్రికెట్ ఆడుతూనే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా వసీం వ్యవహరించనున్నాడు.
నలభై ఏళ్ల వసీం జాఫర్ ఇప్పటికీ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అత్యధిక కాలం పాటు రంజీ ట్రోఫీ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వరుసగా రెండో ఏడాది కూడా రంజీ విజేతగా నిలిచిన విదర్భ జట్టుకు మూల స్తంభంలా ఉన్నాడు. భారత్ తరఫున 31 టెస్టులాడిన జాఫర్ 34.11 సగటుతో 1,944 పరుగులు చేశాడు. అందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. రెండు వన్డేల్లో ఆడే అవకాశం వచ్చినా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఐపీఎల్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 8 మ్యాచ్‌లాడి 130 పరుగులు చేశాడు. భారత జట్టు తరఫున 2000లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. 2008లో అదే జట్టుతో తన ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు.1996-2015 మధ్య కాలంలో ముంబయి జట్టు తరఫున రంజీల్లో ఆడాడు. ప్రస్తుతం విదర్భ జట్టులో కొనసాగుతున్నాడు.
