Womens Cricket: 4-1- 8- 5.. అదిరిపోయే స్పెల్ వేసిన ఆసీస్ మహిళా క్రికెటర్.. బీబీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు..
అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలు కూడా క్రికెట్‌లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా అనితర సాధ్యమైన రికార్డులు సృష్టిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్..ఇలా అల్‌రౌండ్ విభాగాల్లో సత్తాచాటుతున్నారు..
అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలు కూడా క్రికెట్‌లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా అనితర సాధ్యమైన రికార్డులు సృష్టిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్..ఇలా అల్‌రౌండ్ విభాగాల్లో సత్తాచాటుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగుతున్న బిగ్‌బాష్ ఉమెన్స్‌లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ అమెండా జేడ్ వెల్లింగ్‌టన్ అరుదైన గణాంకాలు నమోదు చేసింది. తన ఆఫ్‌స్పిన్‌తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే ఆమె బ్రిస్బేన్ హీట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఆమె 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు నేలకూల్చింది. పైగా అందులో ఒక ఒక మెయిడెన్ ఓవర్ తో పాటు మొత్తం 18 డాట్ బాల్స్ ఉండడం విశేషం. తద్వారా మహిళల బిగ్‌బాష్ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదుచేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది.
గంటల్లో ముగిసిపోయే టీ 20 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీయడమే ఎంతో అరుదు. అలాంటిది ఓ సూపర్ స్పెల్‌తో అమెండా ఈ ఫీట్‌ను అందుకుంది అమెండా వెల్లింగ్టన్. కాగా ఇదే మ్యాచ్‌లో ఆమె మరో ఘనత కూడా అందుకుంది. బిగ్‌బాష్ ఉమెన్స్‌లీగ్‌లో వంద వికెట్ల మార్క్‌ను అందుకుంది. తద్వారా ఈ టోర్నీలో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న ఐదో క్రికెటర్‌గా గుర్తింపు సొంతం చేసుకుంది. కాగా తాజా టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన అమెండా మొత్తం 21 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది.
What a spell from Amanda-Jade Wellington!
Overs: 4 Dot balls: 18 Runs: 8 Wickets: 5
The best bowling figures in WBBL history! ? pic.twitter.com/x0IFnRDpSG
— The Cricketer (@TheCricketerMag) November 24, 2021
Also Read:
PV Sindhu: BWF అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల బరిలో ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు.. డిసెంబర్‌లో ఎన్నికలు
Cricket: రాహుల్, రోహిత్ పైకి.. కోహ్లీ కిందకు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల..
Bhuvneshwar Kumar: తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా స్వింగ్ బౌలర్..