Bhuvneshwar Kumar: తండ్రిగా ప్రమోషన్‌ పొందిన టీమిండియా స్వింగ్‌ బౌలర్‌..

టీమిండియా స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతడి సతీమణి నుపుర్‌ బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది

Bhuvneshwar Kumar: తండ్రిగా ప్రమోషన్‌ పొందిన టీమిండియా స్వింగ్‌ బౌలర్‌..

టీమిండియా స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతడి సతీమణి నుపుర్‌ బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా మంగళవారమే (నవంబర్‌ 23) తమ నాలుగో వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నారు భువీ- నుపుర్‌ దంపతులు. మరుసటి రోజే వారు అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందడం విశేషం. కాగా నుపుర్‌కు మంగళవారం పురిటి నొప్పులు రావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. నేడు(బుధవారం) ఉదయం తొమ్మిది గంటలకు పాప పుట్టిందని వైద్యులు తెలిపారు. నుపుర్‌ వెంట ఆమె తల్లి ఇంద్రేశ్‌, సోదరి లేఖ ఉన్నారు.

భువనేశ్వర్‌- నుపుర్‌ నగర్‌ 2017లో నవంబరు 23న పెళ్లి చేసుకున్నారు . కాగా న్యూజిలాండ్‌తో టీ 20 సిరీస్‌ సందర్భంగా ప్రస్తుతం ఇంటికి దూరంగా ఉంటున్నాడీ స్వింగ్‌ బౌలర్‌. ఈ క్రమంలో తల్లీ కూతులిద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని భువనేశ్వర్‌కు ఫోన్‌లోనే సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. కాగా గురువారం సాయంత్రం నాటికి భువీ తన నివాసానికి చేరుకుంటాడని, అక్కడే తన భార్యబిడ్డలను కలుసుకుంటాడని అతని కుటుంబీకులు తెలిపారు.

Also Read:

Ajaz Patel, sodhi: న్యూజిలాండ్ జట్టులో భారత సంతతి బౌలర్లు.. కాన్పూర్ టెస్ట్‎లో రాణిస్తారా..

Gautam Gambhir: చంపేస్తాం.. గౌతమ్ గంభీర్‌కు టెర్రరిస్టుల నుంచి బెదిరింపులు..

Salman Butt: రవీంద్ర జడేజాకు అక్సర్ పటేల్ ప్రత్యామ్నాయం కాదు.. ఎందుకంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu