Ajaz Patel, sodhi: న్యూజిలాండ్ జట్టులో భారత సంతతి బౌలర్లు.. కాన్పూర్ టెస్ట్‎లో రాణిస్తారా..

న్యూజిలాండ్‌ జట్టులో భారత సంతతి ఆటగాళ్ల వారసత్వం కొత్తేమీ కాదు. ప్రస్తుతం కివీస్ జట్టులో స్పిన్నర్లు అజాజ్ పటేల్, ఇష్‌ సోధి సభ్యులుగా ఉన్న భారత సంతతి ఆటగాళ్లు.

Ajaz Patel, sodhi: న్యూజిలాండ్ జట్టులో భారత సంతతి బౌలర్లు.. కాన్పూర్ టెస్ట్‎లో రాణిస్తారా..
Newzealand
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 24, 2021 | 1:18 PM

న్యూజిలాండ్‌ జట్టులో భారత సంతతి ఆటగాళ్ల వారసత్వం కొత్తేమీ కాదు. ప్రస్తుతం కివీస్ జట్టులో స్పిన్నర్లు అజాజ్ పటేల్, ఇష్‌ సోధి సభ్యులుగా ఉన్న భారత సంతతి ఆటగాళ్లు. గురువారం కాన్పూర్‌లో ప్రారంభమయ్యే టెస్ట్‎లో ఆడే అవకాశం ఉంది. అజాజ్ పాటిల్ తన ఎనిమిదేళ్ల వయస్సులోనే అతని కుటుంబం న్యూజిలాండ్‎కు వెళ్లి స్థరపడ్డారు. 33 ఏళ్ల అజాజ్‌ పటేల్‌ ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అంతర్జాతీయ క్రికెట్లోకి రావడానికి ఎక్కువ సమయమే తీసుకున్నాడు. 30 ఏళ్ల వయసులో అతను న్యూజిలాండ్‌ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత టెస్టుల్లోనూ అవకాశం లభించింది. అజాజ్‌ 9 టెస్టుల్లో 30.46 సగటుతో 26 వికెట్లు, 7 టీ20ల్లో 10.72 సగటుతో 11 వికెట్లు తీశాడు. ఇంకా వన్డేల్లో అతడికి అవకాశం దక్కలేదు. “నేను ఇంతకు ముందు చూడని భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పుడు వెళ్లాను” అని పటేల్ అన్నాడు. ఇండియాను సొంత దేశంలో ఎదుర్కొవడం సవాల్‎గా ఉంటుందన్నారు. భారత జట్టులో అశ్విన్‌, రవీంద్ర జడేజా స్పిన్నర్లు ఉన్నారని చెప్పాడు.

ఇష్‌ సోధి పంజాబ్‌లోని లుధియానాలో పుట్టాడు. చిన్న వయసులోనే కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడ్డాడు. యూత్‌ స్థాయిలో ఆక్లాండ్‌లో క్రికెట్‎లో అవకాశం లభించింది.. తన లెగ్‌ స్పిన్‌తో సత్తా చాటుకుని న్యూజిలాండ్‌ అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగట్రేం చేయడం విశేషం. 2013లో తొలి టెస్టు ఆడిన సోధి.. ఆ తర్వాతి రెండేళ్లలో టీ20లు, వన్డేల్లోనూ అవకాశం దక్కించుకున్నాడు. అరంగేట్రం చేసింది టెస్టుల్లో అయినా.. టీ20ల్లోనే అతను ఎక్కువ ప్రభావం చూపాడు. 29 ఏళ్ల ఇష్‌ ఇప్పటిదాకా 17 టెస్టుల్లో 41, 33 వన్డేల్లో 43, 66 టీ29ల్లో 83 వికెట్లు పడగొట్టాడు.

భారత సంతతి ఆటగాడు రచిన్ రవింద్ర ఇండియాతో జరిగిన టీ20 సిరీస్‎లో ఆడాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ కలిపి రచిన్ రవింద్రగా పేరు పెట్టారు. రచిన్ భారత ప్రధాన కోచ్,రవిచంద్రన్ అశ్విన్‌లతో సంభాషించాలని, కొన్ని చిట్కాలను పొందాలని భావిస్తున్నాడు. కివీస్ తరఫున ఆడిన వారిలో దీపక్ పటేల్, జీతన్ పటేల్, జీత్ రావల్, రోనీ హీరా, టౌర్న్ నెతులా భారత సంతతికి చెందినవారు.

Read Also.. Harbhajan Singh: రూ.17.58 కోట్లకు అపార్ట్‌మెంట్‎ను అమ్మిన హర్భజన్ సింగ్.. నాలుగేళ్లలో మూడు కోట్ల లాభం..

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి