Gautam Gambhir: చంపేస్తాం.. గౌతమ్ గంభీర్‌కు టెర్రరిస్టుల నుంచి బెదిరింపులు..

భారతీయ జనతా పార్టీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Gautam Gambhir: చంపేస్తాం.. గౌతమ్ గంభీర్‌కు టెర్రరిస్టుల నుంచి బెదిరింపులు..
Gautam Gambhir
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 24, 2021 | 12:52 PM

మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఐసిస్ కశ్మీర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గంభీర్ సంప్రదించినట్లు సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ ఏఎన్ఐకి తెలిపారు. గౌతమ్ గంభీర్‌కు ఐఎస్ఐఎస్ కాశ్మీర్ నుంచి ఈ-మెయిల్ ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నారు. ఇదే అంశంపై విచారణ కొనసాగుతోందని డీసీపీ తెలిపారు. గంభీర్‌ నివాసం వెలుపల భద్రతను పెంచినట్లు పోలీసు అధికారి శ్వేతా చౌహాన్ వెల్లడించారు. 40 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ తూర్పు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. గౌతమ్ గంభీర్ ఇంటికి భద్రత పెంచినట్లు సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు.

Gautam Gambhir Alleges Deat

Gautam Gambhir Alleges Deat

ఇవి కూడా చదవండి: ప్రపంచ బ్యాంక్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. 250 మిలియన్‌ డాలర్లతో విద్యా ప్రమాణాల పెంపు..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కేంద్ర వ్యూహం ఇదే..