Cricket: రాహుల్‌, రోహిత్‌ పైకి.. కోహ్లీ కిందకు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ విడుదల..

టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్‌ కోహ్లీ తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ఫలితంగా బుధవారం ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-10 నుంచి ఔటై 11వ వస్థానం లో నిలిచాడు

Cricket:  రాహుల్‌, రోహిత్‌ పైకి.. కోహ్లీ కిందకు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ విడుదల..
Follow us

|

Updated on: Nov 24, 2021 | 6:41 PM

టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్‌ కోహ్లీ తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ఫలితంగా బుధవారం ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-10 నుంచి ఔటై 11వ వస్థానం లో నిలిచాడు. అదే సమయంలో కివీస్‌తో జరిగిన సిరీస్‌లో పరుగుల వరద పారించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కే ఎల్‌ రాహుల్‌ తమ స్థానాలను మరింత మెరుగుపర్చుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌ మొత్తం 80 పరుగులు చేశాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 729 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. కాగా టాప్‌-5 లో ఉన్న ఏకైక భారతీయ క్రికెటర్‌ రాహులే కావడం గమనార్హం. ఇక సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన రోహిత్‌ శర్మ రెండు స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్‌ విభాగంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 809 పాయింట్లతో మొదటి స్థానాన్ని కాపాడుకోగా .. 805 పాయింట్లతో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మలన్‌ రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన మార్కరమ్‌ 796 పాయింట్లతో మూడోస్థానం దక్కించుకున్నాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో రాణించిన కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ చాలా రోజుల తర్వాత టాప్‌-10 చోటు సంపాదించాడు. అతను 658 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు.

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే శ్రీలంక స్పిన్నర్‌ వనిందు హసరంగ 797 పాయింట్లతో తొలి స్థానం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్‌ తబ్రెయిజ్‌ షంసీ 784 పాయింట్లతో రెండో స్థానం.. ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా 725 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. టీమిండియా బౌలర్లలో ఒక్కరు కూడా టాప్‌-10 ర్యాంక్సింగ్స్‌లో చోటు దక్కించుకోలేక పోయారు. ఇక ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌ విభాగంలో అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ 265 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. బంగ్లా క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 231 పాయింట్లతో రెండో స్థానంలో.. ఇంగ్లండ్‌కు చెందిన లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 179 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఈ విభాగంలోనూ టాప్‌-10 జాబితాలో ఒక్క టీమిండియా ఆల్‌రౌండర్లు లేకపోవడం గమనార్హం.

Also Read:

Bhuvneshwar Kumar: తండ్రిగా ప్రమోషన్‌ పొందిన టీమిండియా స్వింగ్‌ బౌలర్‌..

Ajaz Patel, sodhi: న్యూజిలాండ్ జట్టులో భారత సంతతి బౌలర్లు.. కాన్పూర్ టెస్ట్‎లో రాణిస్తారా..

Gautam Gambhir: చంపేస్తాం.. గౌతమ్ గంభీర్‌కు టెర్రరిస్టుల నుంచి బెదిరింపులు..