AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : ఆకాశ్ అంబానీ ముఖానికి తగిలిన ఫోన్.. అభిమానులపై సీరియస్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Watch : ఆకాశ్ అంబానీ బౌండరీ లైన్ వెంట నడుస్తూ స్థానిక అభిమానులను పలకరిస్తున్నారు. ఆ తోపులాటలో ఒక అభిమాని చేతిలోని భారీ ఫోన్ ప్రమాదవశాత్తూ జారి ఆకాశ్ అంబానీ ముఖానికి బలంగా తగిలింది. ఆ తర్వాత ఆయన నొప్పితో విలవిలలాడారు.

Watch : ఆకాశ్ అంబానీ ముఖానికి తగిలిన ఫోన్.. అభిమానులపై సీరియస్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Mi
Rakesh
|

Updated on: May 15, 2026 | 11:18 AM

Share

Watch : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ కేవలం మైదానంలోనే కాదు, బయట కూడా తీవ్ర ఉత్కంఠ రేపింది. ముంబై ఇండియన్స్ గెలిచిన ఆనందంలో ఉన్న ఆ జట్టు యజమాని ఆకాశ్ అంబానీకి ఒక చేదు అనుభవం ఎదురైంది. స్టేడియంలోని పంజాబ్ అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు వెళ్లిన ఆయన ముఖానికి ఒక ఫోన్ బలంగా తగలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

అసలేం జరిగింది?

ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన తర్వాత, ఆకాశ్ అంబానీ బౌండరీ లైన్ వెంట నడుస్తూ స్థానిక అభిమానులను పలకరిస్తున్నారు. ముఖ్యంగా ధర్మశాలలోని పంజాబ్ కింగ్స్ మద్దతుదారులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఆ తోపులాటలో ఒక అభిమాని చేతిలోని భారీ ఫోన్ ప్రమాదవశాత్తూ జారి ఆకాశ్ అంబానీ ముఖానికి బలంగా తగిలింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆయన నొప్పితో విలవిలలాడారు. ఆవేశంలో ఆ సెక్షన్ వైపు సీరియస్‌గా చూస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనకు రక్షణగా నిలిచారు.

క్షమాపణలు కోరిన పంజాబ్ ఫ్యాన్స్

ఆకాశ్ అంబానీ కోప్పడటంతో అక్కడ వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. అయితే అది కావాలని చేసింది కాదని, కేవలం సెల్ఫీ కోసం ఉత్సాహపడటంతోనే అలా జరిగిందని గ్రహించిన అభిమానులు వెంటనే ఆకాశ్ అంబానీకి క్షమాపణలు చెప్పారు. వారి ఆవేదనను చూసి శాంతించిన అంబానీ, పెద్ద మనసుతో వారిని మన్నించారు. అంతటితో ఆగకుండా, మళ్లీ వారితో కలిసి నవ్వుతూ సెల్ఫీలు దిగి అక్కడి నుంచి వెళ్లారు. దీంతో టెన్షన్‌గా ఉన్న వాతావరణం కాస్తా మళ్లీ ఐపీఎల్ జోష్‌తో నిండిపోయింది.

మైదానంలో తిలక్ వర్మ విధ్వంసం

ఈ ఆఫ్-ఫీల్డ్ డ్రామా కంటే ముందు మైదానంలో క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం లభించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. యువ సంచలనం తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం. తిలక్ వర్మ తన ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మకు అంకితం ఇవ్వడం కూడా అభిమానుల మనసు గెలుచుకుంది. ఈ విజయంతో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆకాశ్ అంబానీ ముఖానికి తగిలిన ఫోన్.. అభిమానులపై సీరియస్
ఆకాశ్ అంబానీ ముఖానికి తగిలిన ఫోన్.. అభిమానులపై సీరియస్
ఈ సీసీ కెమెరాకు చిక్కారంటే,మీ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం బట్టబయలు
ఈ సీసీ కెమెరాకు చిక్కారంటే,మీ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం బట్టబయలు
నెయ్యి, యాలకుల సువాసనతో నోట్లో కరిగిపోయే అరటిపండు హల్వా..
నెయ్యి, యాలకుల సువాసనతో నోట్లో కరిగిపోయే అరటిపండు హల్వా..
మీ పిల్లలు చెడు స్నేహం చేస్తుంటే ఇలా కంట్రోల్‌లోకి తెచ్చుకోండి
మీ పిల్లలు చెడు స్నేహం చేస్తుంటే ఇలా కంట్రోల్‌లోకి తెచ్చుకోండి
మనల్ని చూసి అసూయపడే వారిని ఎలా దెబ్బ కొట్టాలి?
మనల్ని చూసి అసూయపడే వారిని ఎలా దెబ్బ కొట్టాలి?
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. IMDBలో 7.1 రేటింగ్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. IMDBలో 7.1 రేటింగ్
భార్యాభర్తల మధ్య దూరం పెంచుతున్న 5 ప్రధాన శత్రువులు ఇవే..
భార్యాభర్తల మధ్య దూరం పెంచుతున్న 5 ప్రధాన శత్రువులు ఇవే..
మరణానికి, పితృలోకానికి.. కాకులు ఎలా వారధులుగా మారాయో తెలుసా?
మరణానికి, పితృలోకానికి.. కాకులు ఎలా వారధులుగా మారాయో తెలుసా?
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
ఒంటి నొప్పులను మాయం చేసే మినపప్పు పాయసం..
ఒంటి నొప్పులను మాయం చేసే మినపప్పు పాయసం..