AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: నెల తిరక్కుండానే.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. IMDBలో 7.1 రేటింగ్

ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీనికి తోడు మూవీ యూనిట్ పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో త్వరగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే.

OTT Movie: నెల తిరక్కుండానే.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. IMDBలో 7.1 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: May 15, 2026 | 11:07 AM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే ధురంధర్ ది రివేంజ్, తిమ్మరాజుపల్లి టీవీ, కాళిదాసు 2, కర్తవ్య వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే శుక్రవారం (మే 15) అర్ధరాత్రి నుంచే మరో కొత్త సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గత నెలలలోనే థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నెల తిరక్కుండానే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఆ సినిమా మరేదో కాదు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాగశౌర్య నటించిన బ్యాడ్ బాయ్ కార్తీక్. 2023లో ‘రంగబలి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేశాడు శౌర్య. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. పెద్దగా కలెక్షన్లు కూడా రాబట్టుకోలేదు. మూవీ యూనిట్ కూడా ప్రమోషన్లు చేయకపోవడంతో బ్యాడ్ బాయ్ కార్తీక్ త్వరగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. రామ్ దేశినా (రమేష్) తెరకెక్కించిన ఈ సినిమాలో విధి యాదవ్ హీరోయిన్ గా నటించింది. ఈశ్వర్ ఫేమ్ శ్రీదేవి, సముద్రఖని, నరేష్, సాయికుమార్, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. దూకుడు స్వభావం కలిగిన కార్తీక్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఇందులో నాగశౌర్యకు అక్కగా శ్రీదేవి నటించింది. అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. మరి థియేటర్లలో ఏ మాత్రం ఆకట్టుకోని బ్యాడ్ బాయ్ కార్తీక్ ఓటీటీలో ఏ మేర అలరిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాగ శౌర్య రీసెంట్ మూవీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల