Oasis Fertility: వరల్డ్ ఐవీఎప్ డేను ఘనంగా నిర్వహించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ.. AI ప్లాట్ ఫామ్ ప్రారంభం
హైదరాబాద్, జూలై 2023 : ప్రపంచంలో మొదటి ఐవిఎఫ్ బేబీ అయిన లూయిస్ బ్రౌన్ 45వ పుట్టినరోజును మనం జరుపుకుంటున్నప్పటికీ, సంతానం లేకపోవడాన్ని ఒక కళంకంగా ఆందోళన చెందుతున్న జంటలు తమ వంధ్యత్వం గురించి మాట్లాడటం ఇప్పటికీ అసౌకర్యంగా భావిస్తున్నారు. అనేక ఆవిష్కరణలు ఐవిఎఫ్ చికిత్సల విజయాల రేటును, భద్రతను మెరుగుపరిచాయి...

హైదరాబాద్, జూలై 2023 : ప్రపంచంలో మొదటి ఐవిఎఫ్ బేబీ అయిన లూయిస్ బ్రౌన్ 45వ పుట్టినరోజును మనం జరుపుకుంటున్నప్పటికీ, సంతానం లేకపోవడాన్ని ఒక కళంకంగా ఆందోళన చెందుతున్న జంటలు తమ వంధ్యత్వం గురించి మాట్లాడటం ఇప్పటికీ అసౌకర్యంగా భావిస్తున్నారు. అనేక ఆవిష్కరణలు ఐవిఎఫ్ చికిత్సల విజయాల రేటును, భద్రతను మెరుగుపరిచాయి. కానీ సంతానోత్పత్తి-సవాలును ఎదుర్కుంటున్న అనేక జంటలకు వంధ్యత్వాన్ని అధిగమించడంలో సహాయపడే సహాయక ఫెర్టిలిటీ సాంకేతికతలో ఉన్న అనేక అవకాశాల గురించి ఇప్పటికీ తెలియదు.
భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి గొలుసుకట్టు సంస్థలలో ఒకటైన ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ కో-ఫౌండర్ & మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి రావు, ఒయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్ & క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్యతో పాటు ఒయాసిస్ ఫెర్టిలిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్ ఈ సందర్భంగా సంతానలేమి సమస్య ఎదుర్కుంటున్న జంటల కోసం ‘ఆస్క్ ఒయాసిస్ ఫెర్టిలిటీ’ పేరుతో ఎఐ-ఆధారితమైన ముఖాముఖిగా తెలుసుకునే ఛాట్‌బాట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ కో ఫౌండర్ అండ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి రావు మాట్లాడుతూ..‘‘వేలాది జంటలు ఐవిఎఫ్ ద్వారా తల్లితండ్రులయ్యే అవకాశాన్ని సాధించడంలో సహాయపడిన ఫెర్టిలిటీ నిపుణులు, ఎంబ్రియాలజిస్ట్‌లు, గైనకాలజిస్ట్‌లందరినీ ఈ సందర్భంగా నేను మన:స్పూర్తిగా అభినందిస్తున్నాను. అనేక వైద్య పురోగతులు రిస్క్‌ను తగ్గించడంతో పాటు ఐవిఎఫ్‌ల విజయాల రేట్లను మెరుగుపరిచాయి. డ్రగ్ ఫ్రీ ఐవిఎఫ్ అనేది ఒక కొత్త మరియు అధునాతనమైన చికిత్స. తక్కువ ఖర్చును ఇష్టపడే చాలా మంది మహిళలకు ఇది ఒక వరం. మొదటి ఐవిఎఫ్ శిశువు జన్మించి 45 సంవత్సరాలైనా, ఐవిఎఫ్ గురించి ప్రజలకు ఇప్పటికీ భయాలు ఉండడం హాస్యాస్పదం. ఒక మహిళకు 30 ఏళ్లు దాటిన తర్వాత సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గుతుంది, కాబట్టి మహిళలు తమ జీవ గడియారం ఏమి చెబుతున్నదో వినాలి. మీరు సంతానం పొందాలనే నిర్ణయాన్ని వాయిదా వేయాలని అనుకుంటే, మీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవడాని కి మరియు మీ సౌలభ్యం మేరకు పేరెంట్‌హుడ్‌ని పొందేందుకు మీకు ఉపయోగపడే సోషల్ ఫ్రీజింగ్ ఆప్షన్‌ను ఎంచుకోండి’ అని చెప్పుకొచ్చారు.




ఇక ఒయాసిస్ ఫెర్టిలిటీ, సైంటిఫిక్ హెడ్ &క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ‘‘తక్కువ లేదా సున్నా స్పెర్మ్ కౌంట్ ఉన్న పురుషుల విషయంలో, ఇది వరకు డోనర్ ట్రీట్‌మెంట్ అవసరమైన వారిలో కూడా ఇప్పుడు వారి సొంత జన్యు సంబంధమైన పిల్లలను పొందడం సాధ్యమైంది, గత 45 సంవత్సరాలలో అనేక ఆవిష్కరణలు వచ్చినందుకు ఆనందంగా వుంది. పురుషులు తమ సంతానోత్పత్తిని పెంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాలి. నేను నొక్కి చెప్పదలుచుకున్న మరో విషయం ఏమిటంటే, ఐవిఎఫ్ పిల్లలు కూడా సహజంగా జన్మించిన శిశువుల మాదిరే ఉంటారు. ఫెర్టిలిటీ నిపుణుడితో సంతానలేమి సమస్య గురించి సంతానం కోరుకునే జంటలు చర్చించవలసి ఉంటుంది, అప్పుడే వారికి వంధ్యత్వాన్ని అధిగమించడంలో సరైన జోక్యం సహాయపడుతుంది’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ఒయాసిస్ ఫెర్టిలిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ.. ‘‘రోగి ఫలితాలను మెరుగుపరచడానికి మా ప్రక్రియలు మరియు రోగి మంచి నిర్ణయాలను తీసుకోవడంలో మేము ఎప్పుడూ కొత్త సాంకేతికతలతో ముందుకు వచ్చాము. ఆస్క్ ఒయాసిస్ ఫెర్టిలిటీ అనేది ఎఐ- పవర్డ్ నాలెడ్జ్ ప్లాట్‌ఫారమ్, ఇది సంతానలేమి సమస్యకు సంబంధించిన సమాచారం కోసం ఒక ఎన్‌సైక్లోపీడియాగా ఉపయోగపడుతుంది. సరైన పరిజ్ఞానం కలిగివుండడం అనేది ఎంతో కీలకం మరియు సంతానలేమితో బాధపడుతున్న జంటలకు ఒక సరైన ఛానెల్ అనేది లేనందున వారి కష్టాలను మేము అర్థం చేసుకున్నాము, దీని ద్వారా వారు వంధ్యత్వం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యూజర్ ఫ్రెండ్లీ ఇంటరాక్టివ్ చాట్‌బాట్ జంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అలాగే తల్లితండ్రులు కావాలనుకునే వారి ప్రయాణంలో వారికి సహాయపడుతుందని మేము ఆశిస్తున్నామ’న్నారు.
ఒయాసిస్ ఫెర్టిలిటీ, విజయవాడ సంతానసాఫల్య సంప్రదింపుల ప్రాముఖ్యతను, అధునాతన సాంకేతికతల ద్వారా తల్లితండ్రులు అయ్యే అవకాశాలను నొక్కి చెప్పడానికి ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవాన్ని జరుపుకుంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ, విజయవాడ, క్లినికల్ హెడ్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, డాక్టర్ సుజాత వెల్లంకి, ఆస్క్ ఒయాసిస్ ఫెర్టిలిటీని ప్రారంభించారు, ఇది ఒక ఎఐ – అధారితమైన ఇంటరాక్టివ్ నాలెడ్జ్ ప్లాట్‌ఫారమ్, సంతానలేమి సమస్య ఉన్న జంటలకు ఒక కనువిప్పుగా ఇది ఉపయోగపడుతుంది. ఆస్క్ ఒయాసిస్ ఫెర్టిలిటీ అనేది అన్ని సంతానోత్పత్తి సమస్యలకు సంబంధించిన ప్రశ్నల కోసం ఖచ్చితమైన మరియు లోతైన సమాచారాన్ని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక వేదిక’ అని తెలిపారు.
ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ, విజయవాడ, క్లినికల్ హెడ్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, డాక్టర్ సుజాత వెల్లంకి మాట్లాడుతూ.. ‘‘వేలాది జంటలు ఐవిఎఫ్ ద్వారా వారి సొంత జన్యుసంబంధమైన బిడ్డను కలిగి ఉండటానికి సహాయపడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సంతానసాఫల్య చికిత్స రంగంలో అనేక పురోగతులు సంభవించినప్పటికీ, అవగాహన లేకపోవడం మరియు సామాజిక కళంకం కారణంగా చాలా మంది ఇప్పటికీ వేదనతో జీవిస్తున్నారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, వరంగల్,క్లినికల్ హెడ్ &ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, డాక్టర్ జలగం కావ్య రావు ఆస్క్ ఒయాసిస్ ఫెర్టిలిటీని ప్రారంభించారు, ఇది ఎఐ-ఆధారితమైన ఇంటరాక్టివ్ చాట్‌బాట్, ఇది సంతానోత్పత్తికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన, లోతైన సమాచారాన్ని అందించడానికి, జంటలకు సరైన దిశలో సంతానోత్పత్తి-సవాళ్లకు మార్గనిర్దేశం చేయడానికి దీనిని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది.
ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, డాక్టర్ జలగం కావ్యరావు ఐవిఎఫ్ ద్వారా గర్భం దాల్చిన పలు జంటలను ఈ సందర్బంగా సత్కరించారు. ఈ సందర్భంగా వరంగల్ ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్య రావు మాట్లాడుతూ.. ‘‘ఐవిఎఫ్ ద్వారా వేల జంటలకు తల్లితండ్రులయ్యే అవకాశాన్ని బహుమతిగా ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రపంచం 10 మిలియన్లకు పైగా ఐవిఎఫ్ పిల్లలను చూసింది, అయితే వంధ్యత్వంపై ఉన్న అపోహలు మరియు ఐవిఎఫ్ గురించిన భయాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. డోనర్ ట్రీట్‌మెంట్‌ల కోసం వెళ్లకుండా జంటలు తమ సొంత జన్యుసంబంధమైన బిడ్డను కలిగి ఉండటానికి అధునాతన సంతానసాఫల్య చికిత్సలు సహాయపడతాయి. ఒక జంట ఒక సంవత్సరం తర్వాత కూడా గర్భం దాల్చలేకపోతే సంతానోత్పత్తి నిపుణుడిని సందర్శించడం చాలా ముఖ్యమైన విషయం’ అని చెప్పుకొచ్చారు.