Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Vehicles: ఇతర కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ బీమా ఎందుకు ఖరీదైనది? పూర్తి వివరాలు మీకోసం..

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అందుకే ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. ఈ జీరో పొల్యూషన్ వాహనాలకు ఇంధనం అవసరం లేదు.

Electric Vehicles: ఇతర కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ బీమా ఎందుకు ఖరీదైనది? పూర్తి వివరాలు మీకోసం..
Ev Insurance Policy
Follow us
Venkata Chari

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 27, 2023 | 11:09 AM

ముంబై: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అందుకే ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. ఈ జీరో పొల్యూషన్ వాహనాలకు ఇంధనం అవసరం లేదు. ఎందుకంటే ఇవి బ్యాటరీలతో పనిచేస్తాయి. వీటిని నిర్వహించడం చాలా సులభం. అయితే, పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల మాదిరిగా కాకుండా బీమా లేకుండా మీరు ఎలక్ట్రిక్ కారును భారత రోడ్లపై నడపలేరు.

ఎలక్ట్రిక్ కార్లు సాధారణంగా ఖరీదైనవి. మీ వాహనం ఏదైనా ప్రమాదంలో, దొంగతనం లేదా మరేదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కారు బీమా పాలసీ మీకు ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఎలక్ట్రిక్ కార్లు ఖరీదైనవి కాబట్టి, వీటి ఆటో బీమా పాలసీ కూడా గ్యాసోలిన్-ఆధారిత కార్ల కంటే ఎక్కువ ఖర్చవుతుంది. ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ ఎందుకు ఖరీదైనది? మనం దానిని ఎలా తగ్గించవచ్చు? ఇలాంటి విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కువ ధర ఉండడానికి గల 3 కారణాలను ఇప్పుడు చూద్దాం..

పెట్రోల్‌తో నడిచే కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లకు బీమా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ కారణాలేంటో వివరంగా తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

1. ఎలక్ట్రిక్ కార్లు ఖరీదైనవి: ఎలక్ట్రిక్ కార్లు ఖరీదైనవి కావడానికి కారణం వీటి ధరలే. ఎలక్ట్రిక్ కార్లు జీరో కాలుష్యం, ప్రయాణీకులకు గరిష్ట సౌకర్యాన్ని అందించడానికి అధునాతనంగా రూపొందించబడ్డాయి. ఇవి ఖరీదైనవి, తాజా సాంకేతికతపై రూపొందించబడ్డాయి. దీంతో ఈ కార్లు ఖరీదైనశిగా చేస్తుంది.

ఎక్కువ ధర కార్ల కోసం అధిక బీమా డిక్లేర్డ్ విలువ (IDV)కి దారితీస్తాయి. వీటిని బీమా చేయడానికి అధిక ప్రీమియంలు చెల్లించవలసి ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్లు అధిక ప్రారంభ కొనుగోలు ధరను కలిగి ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో మరింత సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా నిరూపించబడతాయి.

2. రిపేర్, రీప్లేస్‌మెంట్ ఖర్చులు: ఎలక్ట్రిక్ వాహనాలకు గ్యాసోలిన్-శక్తితో నడిచే వాహనాల కంటే తక్కువ విడి భాగాలు అవసరం. అయినప్పటికీ, ఈ భాగాలను రిపేర్ చేయడానికి, భర్తీ చేయడానికి అయ్యే ఖర్చు తరచుగా ఎక్కువగా ఉంటాయి.

ఉదాహరణకు, ఈ కార్లు అధిక శక్తి గల లిథియం-అయాన్ బ్యాటరీలతో నడుస్తాయి. ఈ బ్యాటరీలను మార్చడానికి అయ్యే ఖర్చు కారు మొత్తం ఖర్చులో సగం. సహజంగానే, ఈ బ్యాటరీలు రిపేర్ చేయడానికి లేదా భర్తీ చేయడానికి ఖరీదైనవి. అంతేకాకుండా, ఈ బ్యాటరీలు ముందుగా నిర్ణయించిన గడువు తేదీతోనే వస్తుంటాయి. ఆ తర్వాత కారు యజమాని వాటిని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల బీమా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల బీమా కోసం అధిక ప్రీమియంలను వసూలు చేస్తాయి.

3. పరిమిత సంఖ్యలోనే సాంకేతిక నిపుణులు: దేశవ్యాప్తంగా సాంప్రదాయ కార్ల కోసం మెకానిక్‌లు, నిపుణులను సులభంగా దొరుకుతారు. కానీ, ఎలక్ట్రిక్ కారును రిపేర్ చేయడానికి ప్రత్యేకమైన నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఇలాంటి వాళ్లు దొరకడం చాలా కష్టం.

అంతేకాకుండా, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతానికైతే కొత్తవి. ఈ కార్ల మరమ్మతు సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్ రిపేర్ కోసం అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, మరమ్మత్తు సౌకర్యాల వల్ల నిపుణుల సేవలకు ఎక్కువ వసూలు చేస్తుంటారు. అందువల్ల బీమా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల బీమా కోసం ఎక్కువ వసూలు చేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను తగ్గించే మార్గాలు..

ఎలక్ట్రిక్ కార్ బీమా పాలసీ ప్రీమియం కవరేజ్ మొత్తం, వాహనం ధర, డ్రైవింగ్ అనుభవం, క్లెయిమ్ చరిత్ర వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఈ కారకాలు కొన్ని మీ నియంత్రణలో లేనప్పటికీ, మీ ఎలక్ట్రిక్ కారు కోసం బీమా ధరను తగ్గించడానికి మీరు తీసుకోవలసిన కొన్ని దశలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

1. ఎలక్ట్రిక్ వాహనానికి భద్రతా పరికరాలను జోడించడం: ఎలక్ట్రిక్ కారు రీప్లేస్‌మెంట్ ధర ఎక్కువగా ఉన్నందున, వీటిని తగ్గించడానికి మీరు మీ వాహనంలో దొంగతనం నిరోధక, ఇతర సారూప్య భద్రతా పరికరాలను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

బీమా ప్రీమియంల ధరను లెక్కించేటప్పుడు బీమా కంపెనీలు ఈ భద్రతా పరికరాలను పరిగణనలోకి తీసుకుంటాయి. అందువల్ల, మీ ఎలక్ట్రిక్ కారు భద్రతను పెంచడం దాని భీమా ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది.

2. ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం: అత్యంత సహేతుకమైన ధరతో ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం. మీరు సంబంధిత కంపెనీ వెబ్‌సైట్‌లలో అనేక బీమా కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ కార్ బీమా ఆఫర్‌లను సరిపోల్చవచ్చు. పాకెట్-ఫ్రెండ్లీ ధర కోసం గరిష్ట కవరేజీతో పాలసీని ఎంచుకోవచ్చు.

ఇంకా, మీరు ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ కోసం వెతికే క్రమంలో బీమా పాలసీ ప్రీమియం మీ బడ్జెట్‌కు కావలసిన కవరేజ్ మొత్తానికి సరిపోతుందో లేదో చూసుకోవచ్చు. ఇందుకోసం కారు బీమా కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు. ఈ విధంగా, మీరు మీ బడ్జెట్ నుంచి మోటారు బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు.

3. నో-క్లెయిమ్ బోనస్‌ని ఉపయోగించడం: ప్రతి సంవత్సరం మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయనట్లయితే, మీ బీమా సంస్థ మీకు నో-క్లెయిమ్ బోనస్‌ను ఇస్తుంది. ఈ బోనస్ మీకు తక్కువ బీమా ప్రీమియం మొత్తాన్ని లేదా ఎక్కువ బీమా మొత్తాన్ని అందిస్తుంది.

మీరు బాధ్యతాయుతంగా డ్రైవ్ చేసి, మీ వాహనాన్ని సరిగ్గా నిర్వహించినట్లయితే, మీరు ప్రతి క్లెయిమ్-రహిత సంవత్సరానికి నో-క్లెయిమ్‌ల బోనస్‌ను అందుకోవచ్చు. కాలక్రమేణా, ఈ నో క్లెయిమ్ బోనస్‌లు మీ బీమా పాలసీ ప్రీమియంలను తగ్గిస్తాయి.

4. తక్కువ మొత్తంలో క్లెయిమ్‌లను తగ్గించాలి: మీరు వాహనాన్ని ఉపయోగించినప్పుడు చిన్నపాటి నష్టాలు, మరమ్మతులు సహజం. మీ ఎలక్ట్రిక్ వాహనానికి అవసరమైన ప్రతి చిన్న మరమ్మత్తు పనికి బీమా క్లెయిమ్ చేయడం మానుకోవాలి.

ఈ విధంగా, మీరు క్లెయిమ్-రహిత సంవత్సరాన్ని, నో-క్లెయిమ్ బోనస్‌ను పొందే అవకాశాలను పెంచుకోవచ్చు. ఇది పాలసీ ప్రీమియంను తగ్గిస్తుంది. అందువల్ల, ప్రతిసారీ క్లెయిమ్ దాఖలు చేయడం కంటే చిన్నపాటి రిపేర్లను మీరే డబ్బు చెల్లించి చేయించుకోవడం మంచిది.

ఎలక్ట్రిక్ కార్లు జీరో కాలుష్య వాహనాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ ఆందోళనలకు ఆచరణాత్మక పరిష్కారంగా మారాయి. ఈ కార్లు అధిక ప్రారంభ ధరను కలిగి ఉన్నప్పటికీ, ఇవి తక్కువ నిర్వహణ, దీర్ఘకాలంలో ఖర్చుతో కూడుకున్నవి. గ్యాసోలిన్‌తో నడిచే కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల బీమా ధర అందుకే ఎక్కువగా ఉంటుంది.

బీమా ధరలు ఎక్కువ కావొచ్చు. కానీ, మీరు కొన్ని సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా పాలసీ ప్రీమియంను తగ్గించుకోవచ్చు.

అగ్రస్థానంలో TATA AIG..

టాటా AIG వంటి ప్రఖ్యాత బీమా కంపెనీలు మీ కారు బీమా ప్రీమియంపై 50% వరకు తగ్గింపుతోపాటు 5సార్లు వరుసుగా నో క్లెయిమ్ బోనస్‌ను అందిస్తాయి. అదనంగా, మీ ఖరీదైన ఎలక్ట్రిక్ కారు బీమా కవరేజీకి జోడించే 18 యాడ్-ఆన్ ఎంపికలను కలిగి అందిస్తున్నారు.