AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2022: నవరాత్రుల వేళ అట్రాక్ట్‌గా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ 9 టిప్స్‌ మీకోసమే..

పండుగ వచ్చిందంటే అందరిలోనూ సందడి మొదలువుతుంది. పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది రుచికరమైన వంటకాలు, పూజలు. అయితే వస్త్రాధారణ, కార్యక్రమాలకు రడీ కావడం కూడా వేడుకల్లో ఓ భాగమే. మరీ ముఖ్యంగా మహిళలు దుస్తుల నుంచి చెప్పుల వరకు, లిప్‌స్టిక్‌ నుంచి..

Navratri 2022: నవరాత్రుల వేళ అట్రాక్ట్‌గా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ 9 టిప్స్‌ మీకోసమే..
Amazon Great Indian Festival
Narender Vaitla
| Edited By: Subhash Goud|

Updated on: Sep 30, 2022 | 9:15 PM

Share

పండుగ వచ్చిందంటే అందరిలోనూ సందడి మొదలువుతుంది. పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది రుచికరమైన వంటకాలు, పూజలు. అయితే వస్త్రాధారణ, కార్యక్రమాలకు రడీ కావడం కూడా వేడుకల్లో ఓ భాగమే. మరీ ముఖ్యంగా మహిళలు దుస్తుల నుంచి చెప్పుల వరకు, లిప్‌స్టిక్‌ నుంచి.. నేల్‌ పాలిష్‌ వరకు ప్రతీ ఒక్క విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. పండుగ నెల రోజుల ముందే షాపింగ్ మొదలు పెడుతుంటారు.

అయితే సరైన మేకప్‌ టిప్స్‌ పాటించకపోతే ఎన్ని రకాల ప్రొడక్ట్స్‌ వాడినా అందంగా కనిపించరు. మరి ఈ నవరాత్రులు జరిగే తొమ్మిది రోజుల్లో ఈ తొమ్మిది టిప్స్‌ పాటించడం ద్వారా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటంటే..

Day 1: Orange and Teal

లైట్‌ గ్రీన్‌, బ్లూ షేడ్‌తో కూడిన కలర్‌ (టీల్‌) ఐ లైనర్‌గా ఉపయోగిస్తే అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. మస్కరాతో పాటు ఈ టీల్‌ కలర్‌ మీ కంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. అదే విధంగా మీ బుగ్గలు, పెదవుల కోసం న్యూడ్‌ బ్రౌన్‌ కలర్‌ను ఉపయోగిస్తే చాలా బాగుంటుంది.

Orange And Teal

Day 2: Monochromatic Look

మోనోక్రోమ్‌ మేకప్‌ మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతుంది. ఒకే రకమైన కలర్‌ షేడ్‌ను కళ్లకు, పేదాలకు, బుగ్గలకు ఉపయోగించడమే ఈ మోనోక్రోమ్‌ మేకప్‌. సెలబ్రిటీలు ఎక్కువగా ఇలాంటి విధానాన్ని ఫాలో అవుతారు. ఇందులో భాగంగా ముందుగా ఫౌండేషన్‌ వేసుకున్న తర్వాత బ్రష్‌తో పింక్‌ కలర్‌ కాకుండా గోల్డ్‌ కలర్‌ను ఉపయోగించండి.

Day 3: Red Lips For Win

రెడ్‌ కలర్‌ డ్రస్‌ ధరించినప్పడు కచ్చితంగా రెడ్‌ కలర్‌ లిప్‌ షేడ్‌ని ఉపయోగించాలి. బుగ్గలకు కూడా ఇదే కలర్‌ షేడ్‌ను అప్లై చేయాలి. పింక్‌ ఐస్‌, రెడ్‌ లిప్స్‌ విధానాన్ని పాటిస్తే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తారు.

Day 4: Smokey Eyes

స్మోకీ కళ్లు కావాలనుకునే వారు ఫేషియల్‌ మేకప్‌ కోసం న్యూడ్‌ బ్రౌన్‌ టోన్‌లను ఉపయోగించండి.

Day 5: Colour Pop With Neon 

నవరాత్రుల వేడుకల్లో అట్రాక్టివ్‌గా కనిపించాలంటే వైబ్రెంట్‌ కలర్స్‌ను ఉపయోగించండి. కలర్‌ మస్కరాను వాడితే చాలా బాగా కనిపిస్తుంది. నియాన్‌ ఐ షాడో, బ్రైట్‌ నియాన్‌ లిక్విడ్‌ లైనర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

Colour Pop With Neon

Day 6: 90s Makeup

90ల్లో ఫాలో అయిన మేకప్‌ విధానాన్ని పొందడానికి గ్రీన్‌ కలర్‌ను ఎంచుకోవచ్చు. మీ స్కిన్‌ టోన్‌కు సరిపోయే రంగును ఎంచుకోవచ్చు. ఐషాడో నుంచి లిప్‌ షేడ్‌ వరకు బ్రైన్‌ మిమ్మల్ని 90ల కాలం నాటికి తీసుకెళ్తాయి.

Day 7: Holographic Effect

ఈ ఫెస్టివల్‌ సీజన్‌లో హోలోగ్రాఫిక్‌ లుక్‌లో ఓసారి ప్రయత్నించండి. ఇందుకోసం మొదట హోలోగ్రాఫిక్ వింగ్డ్ లైనర్‌ని గీయండి, అంనతరం మెరిసే గ్రేడియంట్‌ను యాడ్‌ చేయండి. లిప్ షేడ్ కోసం రెడ్‌ కలర్‌ అయితే బెటర్‌.

 Day 8: Too Much Purple?

మీకు రివర్స్-వింగ్డ్ ఐలైనర్ ట్రెండ్ అంటే ఇష్టమా.. అయితే ఇందుకోసం పర్పుల్‌ ఐషాడోని ఉపయోగించండి. ఐ లైనర్‌ కాస్త పొడిగించండి. అలాగే లుక్‌ని బ్యాలెన్స్ చేయడానికి మీ పైన కంటి రెప్పలపై న్యూట్రల్ లైనర్‌ని ఉపయోగించండి.

Too Much Purple

Day 9: Metallic Shades

గ్రీన్‌ కలర్‌తో ఉండే హెవీ మేకప్‌కు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండండి. పీకాక్‌ గ్రీన్‌ కలర్‌ డ్రస్‌కు గ్రీన్‌ ఐ షాడో బాగుంటుంది. అలాగే గోల్డ్‌, సిల్వర్‌ షాడో మెటాలిక్‌ షేడ్స్‌ కూడా ఉపయోగించవచ్చు. లిప్స్‌ షేడ్‌ కోసం డీప్‌ రెడ్‌, స్ట్రాబెర్రీ రెడ్‌, పీచీ కలర్స్‌ వంటి వాటిని ఉపయోగించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..