AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Great Indian Festival: పండగ సీజన్‌లో అమెజాన్‌ అద్భుతమైన ఆఫర్లు.. ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్‌లపై భారీ తగ్గింపు

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. సరికొత్త ఆఫర్లతో వివిధ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్‌, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను..

Amazon Great Indian Festival: పండగ సీజన్‌లో అమెజాన్‌ అద్భుతమైన ఆఫర్లు.. ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్‌లపై భారీ తగ్గింపు
Amazon Great Indian Festival
Subhash Goud
|

Updated on: Sep 30, 2022 | 7:15 PM

Share

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. సరికొత్త ఆఫర్లతో వివిధ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్‌, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తోంది. ఈ అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫేస్టివల్‌ ఆఫర్‌ను ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఫ్యాషన్, బ్యూటీ షాపింగ్స్‌లో భారీ ఆఫర్లను పొందవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో మీరు దుస్తులు నుండి సౌందర్య ఉత్పత్తుల వరకు విస్తృత శ్రేణి వస్తువులపై అనేక లాభదాయకమైన డీల్‌లు, భారీ తగ్గింపులను అందుకోవచ్చు. రాబోయే సేల్‌ను ఉత్తమంగా ఉపయోగించుకోవడంలో మీకు సహాయపడటానికి, ఈ పండుగ సీజన్‌ను మీరు మిస్ చేయకూడని అన్నిఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్టుల జాబితాను అందుబాటులో ఉంచింది. దీపావలి పండగకు అవసరమైన ప్రొడక్టులపై భారీ తగ్గింపును పొందవచ్చు.

అనార్కలీ కుర్తాలపై ఆఫర్స్‌:

ఇక పెళ్లి, ఫంక్షన్‌, పండగలు, పూజలు.. సందర్భం ఏదైనా అనార్కలీ కుర్తా పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో అనార్కలీ డ్రెస్సులు మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తాయి. మార్కెట్‌లో ప్రస్తుతం అనేక రకాల డిజైన్లు , రంగుల్లో అనార్కలీ కుర్తాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా అలాగే అనార్కలీ కుర్తాల కోసం షాపింగ్‌ చేయాలి అనుకుంటున్నలయితే మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Kurta Pajama

మహిళల అభరణాలపై భారీ ఆఫర్లు:

మహిళలకు జ్యూలరీస్‌ అంటే  ఎంతో మక్కువ. వీటిపై కూడా అమెజాన్‌ భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రకరకాల బ్యూటీ ఆఫర్లపై తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. మీ చెవులు అందంగా కనిపించేందుకు చెవి రింగులు, మెడలో బంగారు హారాలు లాంటి ప్రొడక్టులపై ఈ పండగ సీజన్‌లో అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. తీసుకువచ్చింది. మంచి డైమాండ్‌ నెక్లెస్‌లు వంటి ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ సీజన్‌లో ఏం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్న వారికి సరికొత్త డిజైన్‌తో కూడిన అనార్కలీ కుర్తాలు తీసుకువచ్చింది అమెజాన్‌. అవన్ని కూడా ఫ్రెండ్లీ బడ్జెట్‌ కావడం విశేషం. ఇవన్నీ ఎంతో నాణ్యమైన అనార్కలీ కుర్తాలు. ఫిట్టింగ్‌లు కూడా చక్కగా ఉంటాయి. అందుకే ధరించేందుకు మీరు సౌకర్యంగా ఫీల్‌ అవుతారు. వీటిని ధరించేందుకు సైతం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. క్యాజువల్ వేర్, పార్టీ వేర్‌గా ఈ అనార్కలీ కుర్తాను ధరించవచ్చు. మీకు కావాల్సిన కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

Accessories for the win

ఫుట్‌వేర్‌:

ఈ ఆఫర్లలో భాగంగా మీకు అవసరమైన చెప్పులు కొనుగోలు చేయడం పై మంచి తగ్గింపు ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కలర్స్‌లో, డిజైన్‌లలో కూడిన అనేక రకాల చెప్పులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బ్రాండెడ్ కంపెనీలకు చెందినవి కూడా చాలా ఉన్నాయి. అయితే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో బ్రాండెడ్‌ ఫుట్ వేర్ ల గురించి తెలియజేస్తున్నారు. ఈ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ ఆఫర్‌లో భారీ తగ్గింపు ధరలలో లభిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో మీకు ఇష్టమైన హీల్స్ లేదా షూలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించండి.. మీరు Amazonలో పాదరక్షల కొనుగోలులో 50-80% తగ్గింపు ధరలతో కొనుగోలు చేయవచ్చు. అలాగే భారీ తగ్గింపుతో టాప్ బ్రాండ్‌ల నుండి షూల కోసం చూస్తున్నట్లయితే Amazonలో ఆఫర్‌లో తగ్గింపు ధరలతో సొంతం చేసుకోవచ్చు.

Footwear

సౌందర్య ఉత్పత్తులు:

వివిధ ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కాస్మెటిక్ ఉత్పత్తులపై ఉత్తమమైన డీల్‌లను సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ ఈ ఉత్పత్తులపై తగ్గింపు ధరలతో అందిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో మీకు అవసరమైన అన్ని చర్మ సంరక్షణ, జుట్టుకు సంబంధించిన ప్రొడక్ట్స్‌, మేకప్, ఇతర బ్యూటీ ఉత్పత్తులపై 70 శాతం తగ్గింపుతో పొందవచ్చు. మహిళలకే కాకుండా పురుషులకు వివిధ రకాల బ్రాండ్‌ల వస్త్రాధారణ ఉత్పత్తులపై కూడా తగ్గింపు పొందవచ్చు.

Beauty Products