AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apollo Dialysis Clinic: మరింత చేరువలో నాణ్యమైన డయాలిసిస్ సేవలు.. వరంగల్ అపోలో డయాలిసిస్ క్లినిక్

అపోలో డయాలిసిస్ భారతదేశంలో ప్రముఖ మూత్రపిండ సంరక్షణ సేవలను అందించే సంస్థ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అసోం, బీహార్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో 140+ కేంద్రాలతో మా సేవలు విస్తరించాయి. హీమోడయాలిసిస్, పెరిటోనియల్ డయాలిసిస్, పిల్లల డయాలిసిస్, మూత్రపిండ మార్పిడి (కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్) సేవలను అందిస్తోంది.

Apollo Dialysis Clinic: మరింత చేరువలో నాణ్యమైన డయాలిసిస్ సేవలు.. వరంగల్ అపోలో డయాలిసిస్ క్లినిక్
Apollo Dialysis Clinic
Balaraju Goud
|

Updated on: Feb 11, 2025 | 5:45 PM

Share

ప్రజలకు వైద్యసేవల్ని మరింత చేరువ చేసేందుకు అపోలో హాస్పిటల్‌ యాజమాన్యం కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. నాణ్యమైన డయాలిసిస్ సేవలు మరింత చేరువలోకి తీసుకువచ్చింది. వరంగల్‌లోని NSR హాస్పిటల్‌ సహకారంతో అపోలో డయాలిసిస్ క్లినిక్‌కు శ్రీకారం చుట్టింది. అపోలో హెల్త్ & లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న అపోలో డయాలసిస్ క్లినిక్స్ తన కొత్త డయాలిసిస్ కేంద్రాన్ని అపోలో రీచ్ NSR హాస్పిటల్, వ‌రంగ‌ల్‌లో ప్రారంభించింది. కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు అత్యుత్తమ డయాలిసిస్ వైద్య సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. అధునాతన సాంకేతికతతో నిర్మించిన ఈ సెంటర్‌లో అనుభవజ్ఞులైన నెఫ్రోలజిస్ట్‌లు , ప్రత్యేక శిక్షణ పొందిన డయాలిసిస్ సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని అపోలో నిర్వాహకులు తెలిపారు.

ఈ క్లినిక్ ద్వారా రోగులు ఇకపై ఆరోగ్యశ్రీ, ఇతర ప్రధాన వైద్య బీమా పథకాల ద్వారా డయాలిసిస్ సేవలను పొందవచ్చని అపోలో వైద్యులు తెలిపారు. ప్రపంచస్థాయి వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులో కల్పించడమే ముఖ్య లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నెఫ్రోలజిస్ట్ డా. నిర్మల్ పాపయ్య మాట్లాడుతూ.. డయాలిసిస్ చికిత్సలో వేగంగా, సమగ్రత ఎంతో అవసరమన్నారు. మూత్రపిండ సంబంధిత వ్యాధులను సమయానికి గుర్తించి చికిత్స చేయడం ద్వారా రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చన్నారు. ఈ డయాలిసిస్ సెంటర్ ఆధునిక పద్ధతులతో కూడిన చికిత్సలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అపోలో డయాలసిస్ క్లినిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ రావు అన్నారు.

ఈ అధునాతనమైన డయాలిసిస్ క్లీనిక్ ద్వారా అనేకమంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉన్నతమైన డయాలిసిస్ సేవలను అందించటం జరుగుతుంది . ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ బీమా పథకాల సహకారంతో సేవలను అందించడం ద్వారా, ప్రతి డయాలిసిస్ రోగి తగిన చికిత్స పొందేలా చేయడమే మా లక్ష్యమన్నారు సుధాకర్ రావు. భవిష్యత్తులో, అపోలో డయాలసిస్ క్లినిక్‌లు నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలకు మండలాల స్థాయికి కూడా విస్తరిస్తూ మెరుగైన వైద్య సేవలను అందించటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం తో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది సహకారంతో ప్రపంచస్థాయి డయాలిసిస్ సేవలను ప్రతి రోగికి అందేలా మరియు కిడ్నీ వ్యాధులపై ప్రజలకు అవగాహనకల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

NSR హాస్పిటల్‌లో అపోలో డయాలిసిస్ క్లినిక్‌ను ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయమని NSR హాస్పిటల్‌ గ్రూప్ ఛైర్మన్ N. సంపత్ రావు అన్నారు. అధునాతన కిడ్నీ చికిత్సను అందించడంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. మరిన్ని రోగులకు ఈ సేవలను అందించడానికి కృషి చేస్తామన్నారు.

అపోలో డయాలిసిస్ భారతదేశంలో ప్రముఖ మూత్రపిండ సంరక్షణ సేవలను అందించే సంస్థ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అసోం, బీహార్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో 140+ కేంద్రాలతో మా సేవలు విస్తరించాయి. హీమోడయాలిసిస్, పెరిటోనియల్ డయాలిసిస్, పిల్లల డయాలిసిస్, మూత్రపిండ మార్పిడి (కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్) సేవలను అందిస్తోంది. పల్లెటూర్లు, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన మూత్రపిండ సంరక్షణను అందుబాటులోకి తేనుటలో నిబద్ధంగా ఉన్నామని అపోలో ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.

అపోలో హెల్త్ & లైఫ్‌స్టైల్ లిమిటెడ్ (AHLL) అనేది అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ (AHEL) అనుబంధ సంస్థ. 2002 నుండి, భారతదేశంలో 5500+ వైద్యులతో 20 మిలియన్+ మంది రోగులకు సేవలు అందిస్తున్నారు. వెంటనే ఆసుపత్రి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఇంటికి దగ్గరగా అత్యుత్తమ వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అపోలో నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..