AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశుల వారిని పెళ్లిచేసుకుంటే జీవితంలో విడిపోరు.. ఈ లిస్టులో మీ రాశి ఉందా..?

మన తప్పులను గోరంతవి కొండంత చేయడం. వాటిని ఆసరాగా చేసుకుని అవసరం వచ్చినప్పుడల్లా నిందించే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ, వీరు మన జీవిత భాగస్వాములే అయితే, ఇక ఆ జీవితం దినదినగండమే. ఈ లక్షణం వారిపై ప్రేమను తగ్గించేస్తుంటాయి. కానీ, 12 రాశుల్లో కొన్ని రాశుల వారు మాత్రం ఈ విషయంలో చాలా లక్కీ. ఎందుకంటే ఈ రాశుల వారిని పెళ్లి చేసుకుంటే మీకీ సమస్య ఉండదు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా వీరు మీ తప్పులను మన్నించగలిగే మనసున్నవారు..

ఈ రాశుల వారిని పెళ్లిచేసుకుంటే జీవితంలో విడిపోరు.. ఈ లిస్టులో మీ రాశి ఉందా..?
Zodiac Signs Can Easily Forgive
Bhavani
|

Updated on: Feb 28, 2025 | 12:33 PM

Share

పెళ్లి అనేది హిందూ సాంప్రదాయంలో ఓ మహత్తర ఘట్టం. ఒక్కసారి తలపై జీలకర్ర బెల్లం పెట్టుకుంటే నూరేళ్లపాటు ఆ బంధం కలకాలం నిలవాలని కోరుకుంటారు. అయితే, కొన్ని జంటలు ఈ విషయంలో చాలా అన్ లక్కీ అనే చెప్పాలి. పెళ్లి తర్వాత వచ్చే పొరపొచ్చాలను అతిగా పట్టించుకోవడం, వాస్తవాలు దాచి పెళ్లిళ్లు చేసుకోవడం, కుటుంబ సభ్యుల జోక్యం ఇలా ఎన్నో కారణాలతో ఇవాళ పెళ్లైన ఏడాదికే కోర్టు మెట్లెక్కుతున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రంలో ఇందుకు సంబంధించిన కొన్ని రహస్యాలు దాగున్నాయి. ఈ శాస్త్రం ద్వారా వ్యక్తుల గుణగణాలను కొంతవరకు అంచనా వేయొచ్చు. రాశుల ఆధారంగా వారి ప్రవర్తన, మనస్తత్వం వంటి విషయాలను బేరీజు వేసుకోవచ్చు. మనతో కలకాలం ఉండేదెవరు, వదిలేదెవరో కూడా తెలుసుకోవచ్చు. కొన్ని రాశుల వారు జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా జీవిత భాగస్వామి చేతిని వదలరట. ఎందుకంటే వారి పార్ట్ నర్ తప్పులను సులభంగా క్షమించగలిగే గుణం వీరిలో ఉండటమే ఇందుకు కారణం. మరి ఆ రాశులేమిటో.. అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

వృషభ రాశి..

వృషభం అంటే ఎద్దు. పేరుకు తగ్గట్టే వీరు కుటుంబం, బంధాల కోసం ఎద్దులా శ్రమిస్తారు. మొండితనం, పట్టుదల కొంచెం ఎక్కవే. కానీ వీరు తమ జీవిత భాగస్వామి పట్ల ఎంతో నమ్మకంగా ఉంటారు. వారి నుంచి తెలిసీ తెలియన జరిగే తప్పులు ఎలాంటివైనా తిరిగి వారిని క్షమించగలిగే పెద్ద మనసు వీరికి ఉంటుంది. అందుకే ఈ రాశి వారు మీ లైఫ్ పార్ట్నర్ అయితే మీరు నిజంగా లక్కీనే.

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి వారు సహజంగానే సాత్విక మనస్తత్వం గురువులాంటి లక్షణాల్ని అంతర్లీనంగా కలిగి ఉంటారు. వీరు తమ భాగస్వామి పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారు. వీరు చాలా తొందరగా మన్నించే గుణంకలవారు.

కర్కాటక రాశి..

ఎదుటి వారి నుంచి ప్రేమను కోరుకునే వారిలో కర్కాటక రాశి వారు ముందువరుసలో ఉంటారు. ఎందుకంటే చంద్రుడు వీరికి రాశ్యాధిపతి అవుతాడు. చంద్రుడి లాగానే వీరెప్పుడూ కూల్ గా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇక క్షమాగుణం వీరికి వెన్నతో పెట్టిన లక్షణం.

తులారాశి..

తులారాశి వారు ఎప్పుడూ ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. గొడవలకు కాలుదువ్వే మనస్తత్వం కాదు. ఏదైనా భాగస్వామి నుంచి సమస్య వస్తే దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకుని సాధారణ స్థితికి వస్తారు. గొడవలు వచ్చినా పట్టుదలకు పోకుండా తొందరగా కలిసిపోతారు.

మీన రాశి..

మీన రాశిని పెళ్లి చేసుకునే వారు ఓ విధంగా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే వీరి భాగస్వామి ఎలాంటి వారైనా వారి చేయి వదలరు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓపికతో భరిస్తారు. ఈ రాశి మగవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ప్రేమకు ఎక్కువగా విలువనిచ్చేవారు. కాబట్టి విడిపోయే ఆలోచన రానివ్వరు.