Yadadri: మార్చి 11నుండి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లకు సన్నాహాలు
ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనం కోసం సాధారణ రోజుల్లో 10 నుంచి 20 వేల మంది, సెలవు దినాల్లో 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. త్వరలోనే వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. ఆలయ అధికారులతో ప్రత్యేక సమావేశం కానున్నారు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 11 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఆలయ పునర్నిర్మాణమయ్యాక రెండోసారి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం భారీ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తోంది.
ఫాల్గుణ మాసం తొలిరోజు (మార్చి 11) విష్వక్సేన ఆరాధనతో ఈ ఉత్సవాలు ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతాయి. 21వ తేదీ ద్వాదశి రోజు ఉదయాన్నే గర్భాలయంలో మూలవరులకు చేపట్టే సహస్ర కలశాభిషేకం మహా క్రతువుతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనం కోసం సాధారణ రోజుల్లో 10 నుంచి 20 వేల మంది, సెలవు దినాల్లో 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. త్వరలోనే వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. ఆలయ అధికారులతో ప్రత్యేక సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రజలు తమ ఇలవేల్పుగా భావించే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు లక్షలాదిమంది భక్తులు యాదాద్రికి రానున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..