AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Leaves: ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా? తప్పక తెలుసుకోండి..

భారతదేశంలో ఎక్కువ మంది ఇళ్ల గుమ్మాలకు మామిడి ఆకులు కట్టి ఉంటాయి. ఇది కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, ఇది లోతైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పవిత్ర సంప్రదాయం. పండుగలు, వివాహాలు, పుట్టిన రోజు ఇలా ప్రత్యేక, శుభ సందర్భాల్లో తప్పనిసరిగా గుమ్మానికి ఆకుపచ్చ మామిడి ఆకులు కట్టడం భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుందని, శ్రేయస్సును పెంచుతుందని బలమైన నమ్మకం ఉంది. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా?

Mango Leaves: ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా? తప్పక తెలుసుకోండి..
Mango Leaves
Jyothi Gadda
|

Updated on: Aug 23, 2025 | 9:44 AM

Share

భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిళ్లు. ఇక్కడ ప్రతి హిందూ కుటుంబం ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి ఆకులు కట్టి కనిపిస్తాయి. మామిడి ఆకులను హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంటి గుమ్మానికి మామిడి తోరణం కట్టడం అనేది ఇంటికి వచ్చే దేవుళ్లను,అతిథులను గౌరవంగా, స్వచ్ఛంగా స్వాగతించడానికి చిహ్నం. శ్రీమద్భాగవతం వంటి పురాణ గ్రంథాలలో కూడా దీని గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ పువ్వులు,ఆకులతో గుమ్మాలను అలంకరించడం శుభం, ఆధ్యాత్మికతను సూచిస్తుంది. దేవుళ్ళు, దేవతలు అందించే శాంతి శ్రేయస్సును ఆహ్వానించడా మనం సిద్ధంగా ఉన్నామని ఇది చూపిస్తుంది.

హిందూ పురాణాలలో మామిడి ఆకులు అనేక దేవుళ్ళు, దేవతలతో సంబంధం కలిగి ఉంటాయి. అలాగే, మామిడి ఆకులతో పాటుగా వేప ఆకులకు కూడా మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేప ఆకుల్లో ఆదిశక్తి ఉంటుందని నమ్ముతారు. మామిడి ఆకుల్లో మహాలక్ష్మి నివసిస్తుందని నమ్ముతారు. మామిడి తోరణాలు మన మనసులో మంచి ఆలోచనలను కలిగిస్తాయి. అలాగే గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. ఇకపోతే వేప ఆకులు గాల్లోని విష పదార్థాలను పీల్చుకుంటాయి. ఇవి రెండు ఆకులు ఎండిపోతాయి . కానీ కుళ్లిపోవు. అందుకే వీటిని తోరణాలుగా వాడతారు.

ఇలా గుమ్మానికి కట్టిన మామిడి, వేప ఆకు తోరణాల పచ్చదనం మనసుకు ప్రశాంతతను తెస్తుంది. ఇంట్లోకి మంచి సానుకూలతను స్వాగతించే వాతావరణాన్ని సృష్టిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ సరళమైన ఆచారం నేటికీ ఆరోగ్యం, సామరస్యం, శాంతితో ఇళ్లను ఏకం చేసే అందమైన సంప్రదాయంగా కొనసాగుతోంది. మొత్తం మీద ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల దండ కట్టడం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి గొప్పతనాన్ని సూచిస్తుంది. ఇది మన వారసత్వం, ప్రకృతి మధ్య అందమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..