- Telugu News Photo Gallery Spiritual photos If you mix these in water and take a bath, it will bring good luck to your home.
నీటిలో ఇవి కలిపి స్నానం చేస్తే.. ఇంట్లో అదృష్టం తాండవం చేసినట్టే
ప్రతి రోజూ స్నానం చేయడం అనేది సర్వ సాధారణం. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్ర పడటమే కాకుండా.. ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కానీ మీరు స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపి స్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అదృష్టాన్ని కూడా పెంచుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి నీటిలో ఏం కలిపితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి స్నానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
Updated on: Aug 23, 2025 | 12:24 PM

ప్రతి రోజూ స్నానం చేయడం అనేది సర్వ సాధారణం. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్ర పడటమే కాకుండా.. ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కానీ మీరు స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపి స్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అదృష్టాన్ని కూడా పెంచుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి నీటిలో ఏం కలిపితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి స్నానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి దూరమై మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దురద వంటి చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సమస్యలతో పాటు నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మీలో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి దూరమవుతాయి. అదృష్టం పెరుగుతుంది.

మీరు స్నానం చేసే నీటిలో లావెండర్ ఆయిల్ వేసి స్నానం చేస్తే మానసిక ప్రశాంతత పెరిగి.. నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. అదృష్టం అనేది పెరుగుతుంది.

గులాబీ రేకులు వేసి స్నానం చేయడం వల్ల మీ జీవితంలో శాంతి అనేది పెరుగుతుంది. చర్మ సౌందర్యం కూడా మెరుగు పడుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. వైవాహిక జీవితంలో సఖ్యత నెలకుంటుంది. అదే విధంగా తేనె కలిపి స్నానం చేస్తే ఆర్థిక సంక్షోభాల నుంచి బయట పడతారు.




