వినాయక చవితికి గణపతి విగ్రహం తీసుకొస్తున్నారా? ఈ రూల్స్ తప్పనిసరి
హిందూ మతంలో వినాయకుడికి విశిష్ట స్థానం ఉంది. ఆదిపూజ్యుడు. విఘ్నాలకదిపతి వినాయకుడుని ఏ శుభకార్యం, పుజల్లోనైనా తొలి పూజ చేస్తారు. గణేశుడిని జ్ఞానం, ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని ఇచ్చే దేవుడు అంటారు. గణేశుడిని గజాననుడు, గణపతి, ఏకదంతుడు, వక్రతుండుడు, సిద్ధి వినాయకుడు మొదలైన అనేక పేర్లతో కూడా పిలుస్తారు. వినాయక చవితి పండుగ గణేశుడికి అంకితం చేయబడిన హిందూ మతంలోని ముఖ్యమైన పండుగ. ఈ పండగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం గణేష్ చతుర్థి పండుగ భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి (చవితి) తిథి రోజున వస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 27న జరగనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




