Hinduism: హిందూ ధర్మంలో వర్ణం జన్మచేత కాదు కర్మ చేతనే.. నేటికీ బ్రాహ్మణులుగా పూజించబడుతున్న బ్రాహ్మణేతరులు

Significance of Hindu Religion: సనాతన ధర్మంలో వర్ణాలు చేసే పనులను బట్టి ఏర్పడ్డాయి. ఇతర మతాల్లోని లేని ప్రత్యేక హిందు ధర్మానికి ఒకటి ఉంది. అదే కర్మతత్త్వం. హిందూ మతం..

Hinduism: హిందూ ధర్మంలో వర్ణం జన్మచేత కాదు కర్మ చేతనే.. నేటికీ బ్రాహ్మణులుగా పూజించబడుతున్న బ్రాహ్మణేతరులు
Sanata Dharama Varnalu
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 19, 2021 | 6:48 PM

Significance of Hindu Religion: సనాతన ధర్మంలో వర్ణాలు చేసే పనులను బట్టి ఏర్పడ్డాయి. ఇతర మతాల్లోని లేని ప్రత్యేక హిందు ధర్మానికి ఒకటి ఉంది. అదే కర్మతత్త్వం. హిందూ మతం నుంచి పుట్టిన బౌద్ధ, జైనమతములు కర్మ తత్త్వాన్ని ఒప్పుకొన్నా…. అన్య మతస్థులు కర్మసిద్ధాంతాన్ని అంగీకరించలేదు..అయితే ఈ కర్మసిద్ధాంతమంటే ఏమి? ప్రతికార్యానికీ కార్యకారణ సంబంధఏమిటి అనేది భగద్గీత తెలియజెప్పింది. కాలక్రమంలో అనేక మార్పులు వచ్చాయి.. ఆ మార్పుల్లో భాగంగా వర్ణం, జాతి అంటే సరైన అర్ధం తెలియకుండా ఉంది.సాధారణంగా వర్ణం అంటే జాతి అనే భ్రమ పడుతున్నారు. నిజానికి జాతి వేరు, వర్ణంవేరు. వర్ణములు నాలుగే. కానీ జాతులనేకాలు. ఒక్కొక్క వర్ణములోనూ ఎన్నో జాతులున్నాయి. అయితే జన్మచేత కాదు వర్ణం, కర్మ చేత.. బ్రాహ్మణులుగా పూజించబడి .. ఈరోజుకీ పూజింపబడుతూ .. యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతరులు అనేక మంది మహాపురుషులున్నారు.. వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ఆ మహనీయుల గురించి ఈరోజు తెలుసుకుందాం..

ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు. ఈ మహర్షి గురించి రామాయణము లోని బాల కాండములో వివరించబడింది. ఇక గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు కౌశిక మహర్షి. ఈయనకు ఏడుగురు కుమారులు.. ఇక నక్కలు పట్టుకునే జాతికి చెందినవారు జంబూక మహర్షి. హిందువుల పవిత్రమైన రామాయణం గ్రంథాన్ని రచించిన వాల్మీకి మహర్షి.. ఓ కిరాతక జాతికి చెందిన వారు. ఆదికవిగా పూజిస్తారు. హిందువులకు పవిత్రమైన వేదాలను విభజించి మానవాళికి అందించిన గొప్ప మహర్షి వ్యాసుడు. ఈయన చేపలు పట్టే బెస్తజాతికి చెందినవారు. ఇతడిని వేదవ్యాసుడని కూడా పూజిస్తారు.

గౌతమ మహర్షి కుందేళ్ళను పట్టుకునే జాతికి చెందినవారు. ఇక శ్రీరాముడి గురువు వశిష్ఠుడు ఓ వేశ్యకు పుట్టిన వారు.. ఇతనికి తండ్రి ఎవరో కూడా తెలియదు.. వశిష్ఠుడు భార్య అరుంధతి దేవి.. ఆమె ఓ మాదిగ స్త్రీ.. ఈరోజుకి నూతన దంపతులు అరుంధతి నక్షత్రాన్ని దర్శించి ఈ దంపతులకు నమస్కరం చేసే సాంప్రాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః అంటూ పూజలందుకుంటున్నారు. ఈ దంపతుల కుమారుడి శక్తి.. శక్తి భార్య . ఛండాలాంగని. శక్తి . ఛండాలాంగని దంపతుల కుమారుడి పరాశరుడు.. ఇతను ఓ బెస్త వనిత మత్స్యగంధిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల కుమారుడు వేద వ్యాసుడు.. వేదాలను రాసిన గొప్ప మహనీయుడు. మట్టి కుండల్లో పుట్టిన వారు అగస్యుడు పుట్టుక మాదిగవాని కుమారుడైన.. కర్మ చేతను బ్రాహ్మణుడయ్యాడు.. అతనే మతంగ మహర్షి. ఈ మహర్షి కుమార్తె మాతంగకన్య. శక్తి దేవతగా పూజింపబడుతుంది. ఈ దేవతను కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. కొంతమంది శ్యామలాదేవిగా పూజిస్తున్నారు.

Also Read: ఈజీగా టేస్టీగా కొబ్బరి పాలతో రాగి సేమియా పాయసం తయారీ విధానం