Vinayaka Chavithi : కరోనా వ్యాక్సిన్ బాటిల్‌లో వినాయక విగ్రహం.. మండపంలో టీకాపై అవగాహన కార్యక్రమం.. ఎక్కడంటే..
Vinayaka Chavithi 2021: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మండపాల్లో గణేశుడు వివిధ రూపాల్లో కొలువైనాడు. భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ వినాయకుడు..
Vinayaka Chavithi 2021: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మండపాల్లో గణేశుడు వివిధ రూపాల్లో కొలువైనాడు. భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. తాటిచెట్లపాలెం లో కోవిడ్ వ్యాక్సిన్ కాన్సెప్ట్ తో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ వ్యాక్సిన్ బాటిల్ ను తయారు చేసి అందులో వినాయకుడు ప్రతిమను పెట్టి పూజిస్తున్నారు. వ్యాక్సిన్ బాటిల్ లో వినాయకుడు, వ్యాక్సిన్ వేసే సిరంజి వద్ద పెట్టిన మూషికం ఉండేలా సెట్టింగ్ ఏర్పాటు చేశారు.
కరోనా నేపథ్యంలో కోర్ట్ ఆదేశాలకనుగుణంగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో భక్తులకు మాస్క్ లేకపోతే ప్రవేశం కల్పించడం లేదు. అయిదుగురు మాత్రమే అక్కడ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన వైరస్ ను దేవుడి రూపంలో ఉన్న వ్యాక్సిన్ ను అందరూ వేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. మొదటి డోస్ వేసుకున్న వాళ్ళు.. సెకెండ్ డోస్ ఎన్ని రోజులకు వేసుకోవాలి..? వ్యాక్సిన్ తో ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యేక ఫ్లెక్సీలు పెట్టారు.
ఇక ఒకవైపు వ్యాక్సిన్ వినాయకుడితో అవగాహన కల్పిస్తూనే.. సిబ్బంది సహకారంతో అక్కడే వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేశారు. విశాఖలో అందరిలో వ్యాక్సిన్ పై అపోహలు తొలగించేలా అవగాహన కల్పిస్తున్న ఈ వినాయకుడిని భక్తులు పూజించడంతో పాటు ఆసక్తిగా తిలకిస్తున్నారు.