AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi: వినాయక చవితి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా.. పూజా విధానం మీ కోసం

ఈ మాసంలో గణేశుడిని పూజించడం చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా పరిగణించబడుతుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి పండగ సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు. వినాయక విగ్రహానికి వీడ్కోలు అంటే గణపతి విగ్రహ నిమజ్జనం సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది.

Vinayaka Chavithi: వినాయక చవితి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా.. పూజా విధానం మీ కోసం
Vinayaka Chavithi Puja Tips
Surya Kala
|

Updated on: Sep 04, 2024 | 8:05 PM

Share

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిని వినాయక చవితిగా జరుపుకుంటారు. గణేశ చతుర్థి నుంచి అనంత చతుర్దశి తిధి వరకు గణేశుడిని పూజిస్తారు. భాద్రపద మాసం గణేశుడికి అంకితం చేయబడింది. ఈ మాసంలో గణేశుడిని పూజించడం చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా పరిగణించబడుతుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి పండగ సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు. వినాయక విగ్రహానికి వీడ్కోలు అంటే గణపతి విగ్రహ నిమజ్జనం సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది.

వినాయక చవితి 2024 విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమైన సమయం (గణేష్ చతుర్థి 2024 శుభ ముహూర్తం)

హిందూ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 7న వినాయక చవితి పూజ, విగ్రహ ప్రతిష్ఠాపనకు అనువైన సమయం ఉదయం 11:3 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు ఉంటుంది. ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన వినాయకుడి ఆరాధన, విగ్రహ ప్రతిష్టాపన కోసం పవిత్ర సమయం 2 గంటల 31 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు గణపతి బప్పను పూజించవచ్చు.

వినాయక చవితి రోజున చేయాల్సిన పనులు

  1. ఇంట్లో లేదా పూజా స్థలంలో అందమైన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించండి. వినాయకుడిని అలంకరించండి. పూర్తి ఆచారాలతో పూజించండి.
  2. వినాయక చవితి రోజున ఆచారాల ప్రకారం గణేశుడిని ఇంట్లో ఈశాన్య మూలలో ప్రతిష్టించండి. ఈ దిశలో వినాయకుడిని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. గణేశుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే గణపతి బప్పాను ఎరుపు రంగు వస్త్రం మీద ప్రతిష్టించి ఎరుపు రంగు దుస్తులు ధరింపజేయండి. పూజలో ఎరుపు రంగు దుస్తులను ఉపయోగించండి. గణపతి పూజలో ఎరుపు రంగు పూలు, పండ్లు, ఎర్ర చందనం ఉపయోగించండి.
  5. గణేశుని ఆరాధనలో దర్భ గడ్డి, పూలు, పండ్లు, దీపాలు, అగరుబత్తీలు, గంధం, కుంకుమ వినాయకుడికి ఇష్టమైన లడ్డూలు, మోదకాలు సమర్పించండి.
  6. గణపతి ఆరాధనలో, “ఓం గం గణపతయే నమః” వంటి గణేశ మంత్రాన్ని పది రోజుల పాటు జపించండి.

వినాయక చవితి రోజున చేయకూడని పనులు ఏమిటంటే

  1. గణేష్ చతుర్థి రోజున ఇంట్లో పొరపాటున కూడా సగం నిర్మించిన లేదా విరిగిన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించకండి లేదా పూజించకండి. అలా చేయడం అశుభంగా భావిస్తారు.
  2. గణపతి పూజలో పొరపాటున కూడా తులసి దళాన్ని , మొగలి పువ్వులను ఉపయోగించకూడదు. విశ్వాసం ప్రకారం ఇలా చేయడం వల్ల పూజల ఫలితాలు రావు.
  3. గణేష్ చతుర్థి రోజున ఉపవాసం, పూజలు చేసే వ్యక్తి శరీరం, మనస్సులో స్వచ్ఛంగా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి.
  4. గణేష్ చతుర్థి రోజుల్లో పొరపాటున కూడా తామసిక వస్తువులు తినకూడదు.
  5. గణేష్ చతుర్థి సందర్భంగా కుటుంబ సభ్యులతో గొడవ పడొద్దు.కోపం తెచ్చుకోవద్దు.

వినాయక చవితి పూజా విధానం

వినాయక చవితి పూజ కోసం శుభ్రమైన, నిశ్శబ్ద ప్రదేశంలో పీటాన్ని ఏర్పాటు చేసి గణేశుడి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. గంగాజలంతో విగ్రహాన్ని శుద్ధి చేయండి. ఆ తర్వాత వినాయకుడిని కుంకుమ, చందనం, పూలతో అలంకరించాలి. వినాయక తొండానికి కుంకుమ చందనం అద్దండి. దర్భలను సమర్పించండి. తర్వాత నెయ్యి దీపం వెలిగించి, ధూపం వెలిగించాలి. గణేశుడికి కుడుములు, ఉండ్రాళ్ళు, పండ్లు సమర్పించండి. పూజ ముగింపులో గణపతికి హారతి ఇచ్చి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించండి. ఇలా పూజించడం వలన గణపతి పూజా ఫలం దక్కుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి