Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Workout Tips: వ్యాయామం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. మీ ఆరోగ్యానికి హానికరం..

ఇప్పుడే వ్యాయామం చేయడం ప్రారంభించినట్లయితే.. వర్కవుట్ చేసిన తర్వాత కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. తేలికపాటి శారీరక శ్రమతో ఉదయం ప్రారంభిస్తే.. అది మీకు మరింత ఫిట్‌గా అనిపిస్తుంది. ప్రస్తుతానికి వ్యాయామం చేసిన వెంటనే కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూదు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Workout Tips: వ్యాయామం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. మీ ఆరోగ్యానికి హానికరం..
Workout Tips
Follow us
Surya Kala

|

Updated on: Sep 04, 2024 | 6:18 PM

కొందరు వ్యక్తులు ఫిట్‌నెస్‌పై ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. తమ శరీరం ధృడంగా ఉంచుకోవడానికి కండరాలను పెంచుకోవడానికి కసరత్తుని చేస్తారు. మరికొందరు ఫిట్‌గా ఉండటానికి వ్యాయామం చేస్తారు. అంతేకాదు బరువు తగ్గడానికి ప్రజలు కొంత సమయం వ్యాయామానికి కేటాయిస్తారు. వర్కవుట్ చేయడం వెనుక కారణం ఏదైనా కావచ్చు.. దీని వెనుక శారీరక శ్రమ తప్పదు. అయితే ఇప్పుడే వ్యాయామం చేయడం ప్రారంభించినట్లయితే.. వర్కవుట్ చేసిన తర్వాత కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.

వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. తేలికపాటి శారీరక శ్రమతో ఉదయం ప్రారంభిస్తే.. అది మీకు మరింత ఫిట్‌గా అనిపిస్తుంది. ప్రస్తుతానికి వ్యాయామం చేసిన వెంటనే కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూదు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

వెంటనే ఎక్కువ మొత్తంలో నీరు తాగడం

వ్యాయామం చేసిన తర్వాత శరీరం నుండి చాలా చెమట బయటకు వస్తుంది. అటువంటి పరిస్థితిలో వ్యాయామం చేసిన తర్వాత ఎవరికైనా తీవ్రమైన దాహం అనిపిస్తుంది. దీంతో ఒకేసారి చాలా మొత్తంలో నీరు తాగుతారు. అయితే ఇది ఆరోగ్యానికి హానికరం. మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో లేదా వ్యాయామం తర్వాత నీరు త్రాగాలని అనుకుంటే.. ముందుగా హాయిగా కూర్చుని దీర్ఘ శ్వాస తీసుకోవాలి. తరువాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు తాగాలి.

ఇవి కూడా చదవండి

వ్యాయామం తర్వాత వెంటనే స్నానం చేయడం

వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేసేవారిలో మీరు కూడా ఉన్నట్లయితే.. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తెలుసుకోండి. ఎవరైనా సరే వ్యాయామం లేదా ఏదైనా భారీ శారీరక శ్రమ చేసినట్లయితే.. కనీసం అరగంట తర్వాత అంటే శరీరం పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి.

ఎక్కువ మొత్తంలో ఆహారం తినవద్దు

వ్యాయామం అధికంగా చేసిన తర్వాత ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తినొద్దు. వ్యాయామం చేసిన తర్వాత కనీసం 30-35 నిమిషాల విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా భోజనం లేదా స్నాక్స్ తినడానికి ప్రయత్నించండి. అంతేకాదు ఎక్కువ సేపు వ్యాయామం చేసిన తర్వాత శరీరంపై మరింత ఒత్తిడిని కలిగించే ఇతర కార్యకలాపాలు చేయవద్దు. ఇలా చేయడం వలన కండరాలలో ఒత్తిడిని కలిగించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note:పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.