AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi: వినాయక చవితి రోజున గణపతికి నైవేద్యంగా శ్రీఖండ్ ని సమర్పించండి.. రెసిపీ మీ కోసం

ఈ ఏడాది గణేష్ చతుర్థి పవిత్ర పండుగ సెప్టెంబర్ 7న జరుపుకోనున్నారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాల్లో అనేక మతపరమైన కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తారు. వినాయకుడికి సమర్పించడానికి రకరకాల వంటకాలు, స్వీట్లు తయారుచేస్తారు. వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడానికి కుడుములు, ఉండ్రాళ్లు మాత్రమే కాదు ఇంట్లో రుచికరమైన శ్రీఖండాన్ని కూడా తయారు చేసుకోవచ్చు.

Vinayaka Chavithi: వినాయక చవితి రోజున గణపతికి నైవేద్యంగా శ్రీఖండ్ ని సమర్పించండి.. రెసిపీ మీ కోసం
Vinayaka Chavithi Naivedyam
Surya Kala
|

Updated on: Sep 04, 2024 | 7:39 PM

Share

ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగను దేశంలో ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. గణపతి బప్పా రాక కోసం సన్నాహాలు చాలా ముందుగానే చేసుకోవడం మొదలు పెడతారు. ప్రజలు గొప్ప వైభవంగా ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటారు. ఇందు కోసం ముందుగానే సన్నాహాలు చేసుకుంటారు. వినాయక విగ్రహాన్ని ఎంచుకోవడం నుంచి ఇంటిని శుభ్రపరచడం, విగ్రహం ప్రతిష్టించే స్థలాన్ని అలంకరించడం వరకు అనేక పనులను ముందుగానే సన్నాహాలు ప్రారంభిస్తారు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఘనంగా స్వాగతం పలకడమే కాదు 10 రోజులు పూజించి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.

ఈ ఏడాది గణేష్ చతుర్థి పవిత్ర పండుగ సెప్టెంబర్ 7న జరుపుకోనున్నారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాల్లో అనేక మతపరమైన కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తారు. వినాయకుడికి సమర్పించడానికి రకరకాల వంటకాలు, స్వీట్లు తయారుచేస్తారు. వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడానికి కుడుములు, ఉండ్రాళ్లు మాత్రమే కాదు ఇంట్లో రుచికరమైన శ్రీఖండాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు శ్రీ ఖండ్ ను తయారు చేసే విధానం తెలుసుకుందాం

శ్రీ ఖండ్ ను తయారు చేసేందుకు కావాల్సిన వస్తువులు

  1. చిక్కటి పెరుగు- 1 కిలోల (పులుపు లేని తాజాగా పెరుగు)
  2. చక్కెర పొడి- 1/2 కప్పు పాలు
  3. మీగడ- 1/2 కప్పు
  4. యాలకుల పొడి- 1/2 టీస్పూన్
  5. కుంకుమపువ్వు- 1/4 టీస్పూన్
  6. బాదం, పిస్తా, జీడిపప్పు- 2 టేబుల్ స్పూన్లు తరిగిన ముక్కలు
  7. దాల్చినచెక్క – 1/4 టీస్పూన్

తయారీ విధానం: శ్రీఖండాన్ని తయారు చేయడానికి ముందుగా పెరుగును తీసుకుని ఒక మస్లిన్ క్లాత్ లేదా మెష్ స్ట్రైనర్‌లో వేసి బాగా వడకట్టాలి. తద్వారా పెరుగులోని అదనపు నీరు తొలగిపోతుంది. అప్పుడు పెరుగు చిక్కగా మారుతుంది. ఇప్పుడు ఈ పెరుగును ఒక పాత్రలో వేసి దానికి పంచదార పొడి వేసి బాగా కలపాలి. పెరుగు చాలా చిక్కగా మారిన తర్వాత దానికి పాలును జోడించండి. తద్వారా మిశ్రమం కొద్దిగా పల్చగా మారుతుంది. అనంతరం రుచి, రంగు కోసం యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమపువ్వు జోడించండి. ఇష్టమైన వారు దాల్చిన చెక్క పొడి, వెనిల్లా ఎసెన్స్ కూడా జోడించుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. దీనికి క్రీమ్ కూడా జోడించవచ్చు. దీని వల్ల శ్రీఖండ్ మరింత క్రీమీగా మారుతుంది. ఇప్పుడు దానిని సరిగ్గా కలిపిన తర్వాత ఈ మిశ్రమం ఉన్న పాత్రను కవర్ చేసి కనీసం 2 నుండి 3 గంటలపాటు రిఫ్రిజిరేటర్‌లో పెట్టి చల్లబరచండి. దీని తర్వాత జీడిపప్పు, బాదం, పిస్తా వంటి తరిగిన డ్రై ఫ్రూట్స్ ని జోడించండి. అంతే రుచికరమైన శ్రీ ఖండ్ రెడీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..