క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయ.. దుంప జాతికి చెందిన క్యారెట్ ఇంతకుముందు శీతాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఏడాది పొడవునా దొరుకుతోంది.. క్యారెట్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల కళ్లు, కాలేయం, కిడ్నీలు, ఇతర శరీర భాగాలు కూడా అపారమైన ప్రయోజనాలను పొందుతాయి. రోజూ క్యారెట్ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం..