Vinayaka Chavithi: వినాయక చవితి పూజలో దర్భ గడ్డికి విశేష ప్రాముఖ్యత.. గణపతిని దర్భలతో ఎందుకు పుజిస్తారంటే

హిందూ మత విశ్వాసాల ప్రకారం గణేశుని ఆరాధనలో దర్భ గడ్డికి చాలా ప్రాముఖ్యత ఉంది. దర్భలు లేని గణేశుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. దర్భలను నైవేద్యంగా సమర్పించడం వలన జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం. వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పూజలో దర్భలను ఎందుకు సమర్పిస్తారో ఈ రోజు తెలుసుకుందాం..

Vinayaka Chavithi: వినాయక చవితి పూజలో దర్భ గడ్డికి విశేష ప్రాముఖ్యత.. గణపతిని దర్భలతో ఎందుకు పుజిస్తారంటే
Lord Ganesha Puja
Follow us
Surya Kala

|

Updated on: Sep 04, 2024 | 6:41 PM

వినాయక చవితి హిందువుల ప్రధాన పండుగ. దీనిని గణేశుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ పండుగ హిందూ క్యాలెండర్ లో భాద్రపద మాసం శుక్ల పక్షంలో చతుర్థి తిథిలో వస్తుంది. ఈ పండగ సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది. వినాయక చవితి ముగింపులో అంటే పదవ రోజున అనంత చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం చేస్తారు. ఈ రోజున భక్తులు గణపతి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసి.. వచ్చే ఏడాది మళ్ళీ తిరిగి రమ్మనమని గణేశుడిని ప్రార్థిస్తారు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం గణేశుని ఆరాధనలో దర్భ గడ్డికి చాలా ప్రాముఖ్యత ఉంది. దర్భలు లేని గణేశుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. దర్భలను నైవేద్యంగా సమర్పించడం వలన జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం. వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పూజలో దర్భలను ఎందుకు సమర్పిస్తారో ఈ రోజు తెలుసుకుందాం..

వినాయక చవితి ఎప్పుడు? (గణేష్ చతుర్థి 2024 తేదీ)

వేద పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు 7వ తేదీ సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 7 శనివారం రోజున జరుపుకుంటారు. ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ఉపవాస దీక్షలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

చవితికి మతపరమైన ప్రాముఖ్యత

గణేశుడిని అడ్డంకులను తొలగించేవాడు అంటారు. దర్భలను సమర్పించడం వల్ల అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. దర్భ గడ్డి చాలా పవిత్రమైనది. దర్భలను సమర్పించడం వెనుక ఉన్న మత విశ్వాసం ఏమిటంటే పూజా కార్యక్రమాలు పవిత్రంగా చేస్తారు. అలాగే వినాయకుడికి దర్భలను సమర్పించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి. గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి, అనుగ్రహాన్ని పొందేందుకు దర్భ ఒక సులభమైన మార్గం అని నమ్ముతారు. దర్భ అనేది గణేశుడి పట్ల గౌరవం, ప్రేమకు చిహ్నం. ఇది గణేశుని పట్ల భక్తిని చూపుతుంది. కనుక గణపతి పూజలో దర్భ ఖచ్చితంగా సమర్పిస్తారు.

పూజలో దర్భలను ఉపయోగించడం

హిందూ విశ్వాసం ప్రకారం గణేశుడికి దర్భలను సమర్పించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి. అన్ని కార్యాలు నెరవేరుతాయి. అలాగే ఏదైనా శుభ కార్యం చేసే ముందు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దర్భలను పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటి చుట్టూ దర్భలను పెట్టడం వలన ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుందని నమ్ముతారు.

గణేశుడికి దర్భలను సమర్పించడం వెనుక పురాణ కథలున్నాయి

ఒక పురాణం ప్రకారం పురాతన కాలంలో అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఋషులు, దేవతల నుంచి మానవుల వరకు ప్రతి ఒక్కరూ అనలాసురుడు సృష్టించే భీభత్సం, దురాగతాల వల్ల ఇబ్బంది పడ్డారు. అందరినీ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అటువంటి పరిస్థితిలో దేవతలందరూ శివుని వద్దకు చేరుకుని రాక్షసుడి దుశ్చర్యల గురించి చెప్పారు. ఈ రాక్షసుడి నుంచి తమని రక్షించమని ని దేవుడిని ప్రార్థించాడు. దీంతో పరమశివుడు అనలాసురుడు అనే రాక్షసుడిని గణేశుడు మాత్రమే నాశనం చేయగలడని చెప్పాడు.

దీని తరువాత దేవతలందరూ కలిసి వినాయకుడిని ప్రార్థించారు. రాక్షస సంహారం కోసం అభ్యర్థించారు. అప్పుడు గణేశుడు రాక్షసుడి వద్దకు చేరుకొని అనలాసురుడిని మింగేశాడు. అలా రాక్షసుడిని మింగిన తర్వాత గణపతి గుండెల్లో మంట మొదలైంది. అప్పుడు కశ్యపు మహర్షి గణపతి తినడానికి 21 దర్భ గడ్డిని తినమని ఇచ్చాడు. అప్పుడు గణపతి గుండెల్లో మంట చల్లార్చింది. అప్పటి నుండి గణేశుడికి దర్భలను సమర్పించడం సాంప్రదాయంగా మొదలైంది. దర్భలను సమర్పిస్తే వినాయకుడు ప్రసన్నం అవుతాడని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి