డాక్టర్ల ప్రకారం.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య పెరిగినప్పుడు, కళ్ళు ఎక్కువగా ప్రభావితమవుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే చూపు కూడా పోతుంది. కాబట్టి కళ్లు పొడిబారినా, చికాకుగా ఉన్నా, ఎర్రగా లేదా దురదగా ఉన్నా, కళ్లలో నీళ్లు కారుతున్నా, చూపు మసకబారిపోతున్నా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. వీటిల్లో ఏదైనా ఒక లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కళ్ళు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన, సున్నితమైన భాగాలలో ఒకటి.