AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. చంద్ర దర్శనం జరిగితే దోషం తొలగడానికి ఏమి చేయాలంటే..

గణేష్ చతుర్థి నాడు గణేష్‌ను పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. జీవితంలో ఆనందం,శ్రేయస్సు వస్తుంది. అయితే ఈ పవిత్ర పండుగ సందర్భంగా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి పొరపాటున కూడా చేయకూడదు, లేకపోతే గణపతి బప్పాకి కోపం కలగవచ్చు. పూజ శుభ ఫలితాలు కూడా పొందలేరు.

వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. చంద్ర దర్శనం జరిగితే దోషం తొలగడానికి ఏమి చేయాలంటే..
Lord Ganesha Puja
Surya Kala
|

Updated on: Aug 25, 2025 | 9:29 AM

Share

దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. గణేష్‌ను అడ్డంకులను నాశనం చేసేవాడు.. జ్ఞానం, శ్రేయస్సును ప్రసాదించేవాడుగా భావిస్తారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తిథిన గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు భక్తితో బప్పాను పూజించి ఆయనను స్వాగతించడానికి సిద్ధమవుతారు. గణేష్ చతుర్థి నాడు గణేష్‌ను పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. జీవితంలో ఆనందం,శ్రేయస్సు వస్తుంది. అయితే ఈ పవిత్ర పండుగ సందర్భంగా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి పొరపాటున కూడా చేయకూడదు, లేకపోతే గణపతి బప్పాకి కోపం కలగవచ్చు. పూజ శుభ ఫలితాలు కూడా పొందలేరు.

2025 గణేష్ చతుర్థి ఎప్పుడు? పంచాంగం ప్రకారం, 2025 సంవత్సరంలో గణేష్ చతుర్థి పండుగ ఆగస్టు 27, బుధవారం నాడు జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి.. 10 రోజుల పాటు పూర్తి ఆచారాలతో పూజిస్తారు.

గణేష్ చతుర్థి నాడు పొరపాటున కూడా ఏ పని చేయవద్దంటే

చంద్రుడిని చూడకండి. గణేష్ చతుర్థి నాడు చంద్రుడిని చూడటం అశుభమని భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున చంద్రుడిని చూడటం వల్ల వ్యక్తి నీలాపనించల బారిన పడవచ్చు. పురాణాల ప్రకారం ఒకసారి చంద్రుడు గణేశుడి గజముఖ (ఏనుగు తల)ను ఎగతాళి చేయడం వల్ల ..పార్వతీదేవి కి ఆగ్రహం వచ్చి.. చంద్రుడిని శపించింది. కనుక ఈ రోజున చంద్రుడిని చూడవద్దు. ఒకవేళ అనుకోకుండా చంద్రుడు కనిపిస్తే, ‘శ్రీమద్భగవత్’ 10వ అధ్యాయంలోని 57వ అధ్యాయంలో శమంతక మణికి సంబంధించిన కథను చదవడం వల్ల దోషం తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

విరిగిన గణేశుడి విగ్రహాన్ని తీసుకురావద్దు. గణేష్ చతుర్థి నాడు ఇంట్లో కొత్త గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు. అది ఎక్కడా విరిగి ఉండకూడదు అని గుర్తుంచుకోండి. విరిగిన లేదా దెబ్బతిన్న విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురావడం లేదా పూజించడం అశుభంగా పరిగణించబడుతుంది. దీనివల్ల పూజ ఫలాలు లభించవు. మట్టితో చేసిన గణేష్ విగ్రహాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇవి పర్యావరణానికి కూడా మంచివి.

తామసిక ఆహారం తీసుకోవద్దు గణేష్ చతుర్థి సందర్భంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ 10 రోజుల పండుగ మొత్తం వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసాహారం, మద్యం తీసుకోవడం పూర్తిగా నిషేధించబడింది. తామసిక ఆహారం మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతికూలతను తెస్తుందని నమ్ముతారు. ఇది పూజకు తగినది కాదు. గణేశుడికి స్వచ్ఛమైన, సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా మాత్రమే సమర్పించాలి.

తులసిని ఉపయోగించవద్దు గణేశుడి పూజలో తులసిని ఉపయోగించడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం తులసి గణేశుడి వివాహ ప్రతిపాదనను తిరస్కరించింది. అతన్ని శపించింది కూడా. దీనితో ఆగ్రహంతో గణేశుడు, తన పూజలో తులసిని ఉపయోగించకూడదని ఆమెను శపించాడు. అందువల్ల తులసికి బదులుగా, గణేశ పూజలో దర్భ గడ్డిని ఉపయోగించాలి. ఇది గణేశుడికి చాలా ఇష్టమైనది.

విగ్రహాల సంఖ్యను గమనించండి ఇంట్లో ఒకే ఒక్క గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. మీరు రెండు లేదా అంతకంటే ఎక్కువ విగ్రహాలను పూజలో పెడితే అవి ఒకదానికొకటి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. రెండు విగ్రహాలను ఒకదానికొకటి ఎదురుగా ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు.

నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించవద్దు గణేష్ పూజ సమయంలో నలుపు, నీలం రంగు దుస్తులు ధరించకూడదు. ఈ రంగులను పూజకు అశుభకరమైనవిగా భావిస్తారు. ఈ రోజున పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులతో కూడిన ప్రకాశవంతమైన, శుభ్రమైన దుస్తులను ధరించడం శుభప్రదం. ఈ రంగులు సానుకూలత, ఉత్సాహాన్ని సూచిస్తాయి.

శుభ ఫలితాలను పొందడానికి మార్గాలు

గణేశుడికి 21 దర్భలను సమర్పించండి.

కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డులను సమర్పించండి.

“ఓం గం గణపతయే నమః” అనే మంత్రాన్ని పఠించండి.

గణేష్ చతుర్థి ప్రాముఖ్యత

గణేష్ చతుర్థి పండుగ మతపరంగానే కాకుండా సాంస్కృతిక పరంగా కూడా చాలా ముఖ్యమైనది. ఈ రోజున గణపతిని పూజించడం ద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, సానుకూల శక్తి నివసిస్తాయని నమ్ముతారు. దీనితో పాటు జీవితంలోని ప్రతి అడ్డంకి తొలగిపోతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.