AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monday Puja Tips: ఒకొక్క కోరికకి శివయ్యకి ఒకొక్క విధంగా పూజ.. ఏ ఏ కోరికలు నెరవేరడానికి ఏ విధమైన శివ పూజ చేయాలంటే..

సోమవరం శివుడికి ప్రార్థనలు చేయడానికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే చంద్రుడు శివుని హృదయానికి దగ్గరగా ఉంటాడని నమ్ముతారు ప్రతి సోమవారం శివుడిని పూజించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. భక్తుల మనస్సులను, హృదయాలను శుద్ధి చేసుకోవడానికి సహాయపడే శక్తివంతమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ. చాలా మంది సోమవార ఉపవాసాన్ని.. ఆశీర్వాదం పొందడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, శ్రేయస్సును ఆకర్షించడానికి, జీవితంలోని అడ్డంకులను తొలగించడానికి పాటిస్తారు. శివుడు జలం, నీరు సమర్పించినా.. చాలా త్వరగా సంతోషించే దేవుడు. అందుకనే భోలాశంకరుడు అని అంటారు. వివిధ కోరికలను నెరవేరడానికి శివుడిని ఎలా పూజించాలంటే..

Monday Puja Tips: ఒకొక్క కోరికకి శివయ్యకి ఒకొక్క విధంగా పూజ.. ఏ ఏ కోరికలు నెరవేరడానికి ఏ విధమైన శివ పూజ చేయాలంటే..
Shiva Puja
Surya Kala
|

Updated on: Aug 25, 2025 | 6:56 AM

Share

హిందూ మతంలో భక్తుల పూజలకు చాలా త్వరగా సంతోషించే ఏకైక దేవుడు శివుడు. తన భక్తుల పూజకు సంతోషించిన శివుడు వారిపై తన ఆశీర్వాదాలను కురిపించి.. కోరిన కోర్కెలు నేరవేరుస్తాడని నమ్ముతారు. సోమవారం శివుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజు. శివుడు చాలా దయగలవాడు. శివలింగానికి నిర్మలమైన మనసుతో జలంతో అభిషేకం చేసినా సంతోషిస్తాడు. భోలేనాథుడు ఆది అంతం లేని దైవంగా నమ్మకం. భూమి నుంచి ఆకాశం వరకు, నీటి నుంచి అగ్ని వరకు ప్రతి మూలకంలో ఆయన ఉన్నాడు. వివాహంలో శాంతి, ఆర్థిక స్థిరత్వం, ప్రతికూల కర్మల నుంచి విముక్తి కోరుకునే వారికి సోమవారం పూజ ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది. అవివాహిత స్త్రీలు ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిని కనుగొనడానికి ఆచారాలు నిర్వహిస్తారు. ప్రతి వ్యక్తి శివుని మంత్రాలను జపించడం ద్వారా, ఆయనను పూజించడం ద్వారా తన కోరికలన్నీ నెరవేరుతాయి. వివిధ కోరికల కోసం శివుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.

అకాల మరణ భయాన్ని తొలగించడానికి:

  1. అకాల మరణ భయాన్ని తొలగించడానికి, శివుని కైలాసనాథ రూపాన్ని పూజించండి.
  2. దీని కోసం, పూజ గదిలో నర్మదేశ్వర శివలింగాన్ని ప్రతిష్టించండి.
  3. భోలే శంకరుడికి పండ్లు, పూలు, స్వీట్లు సమర్పించండి.
  4. శివుని పంచోపచార ఆరాధన చేయండి. శివుని పంచోపచార ఆరాధన అంటే ఐదు ఉపచారాలు (సేవలు) అందించడం ద్వారా శివుని పూజించడం. ఈ ఐదు ఉపచారాలు గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం (ఆహారం).
  5. ఆకుపచ్చ రంగు దుప్పటి మీద కూర్చుని ఓం నమో భగవతే రుద్రాయ స్వాహా అనే మంత్రాన్ని జపించండి.
  6. ఇలా మంత్రాన్ని జపించేటప్పుడు, మీ ముఖాన్ని ఉత్తరం వైపు ఉంచి మంత్రాన్ని 17 సార్లు జపించండి.
  7. మంత్రం జపం చేసిన తర్వాత శివుడికి ప్రసాదంగా పండ్లను సమర్పించండి.
  8. శివుడికి హారతి ఇచ్చి శివుడిని స్తుతించండి.

అప్పుల బాధ నుంచి విముక్తి పొందడానికి శివుడిని ఎలా పూజించండి.

  1. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి, నందిపై స్వారీ చేస్తున్న శివుని చిత్రాన్ని పూజించండి.
  2. పూజ గదిలో పాలరాయి శివలింగాన్ని ప్రతిష్టించండి.
  3. శివుడికి పండ్లు, పూలు, స్వీట్లు సమర్పించండి. శివుని పంచోపచార పూజ చేయండి.
  4. ఎర్రటి దుప్పటి మీద కూర్చొని “ఓం నమో భగవతే గంగరుద్రయ స్వాహా” అనే మంత్రాన్ని జపించండి.
  5. ఈ సమయంలో తూర్పు వైపు ముఖం పెట్టి మంత్రాన్ని 19 సార్లు జపించండి.
  6. ఇలా జపం చేసిన తర్వాత శివుడికి ప్రసాదంగా డ్రై ఫ్రూట్స్ ని సమర్పించండి.
  7. శివుడికి హారతి ఇచ్చి స్తుతించండి.

జ్ఞానం, సంపద కోసం

  1. జ్ఞానం, సంపద పొందడానికి, శివుని యోగేశ్వర రూపాన్ని పూజించండి.
  2. పూజ గదిలో మట్టి శివలింగాన్ని ప్రతిష్టించి పంచోపచార పూజ చేయండి.
  3. నీలిరంగు దుప్పటి మీద కూర్చుని ఓం నమో భగవతే వ్యాఘ్రరుద్రాయ స్వాహా అనే మంత్రాన్ని జపించండి.
  4. ఉత్తరం వైపు కూర్చుని మంత్రాన్ని 11 సార్లు జపించండి.
  5. జపం పూర్తయిన తర్వాత, శివుడికి బిల్వ ఆకులు, బిల్వ ఫలాన్ని సమర్పించండి. చివరగాహారతి ఇచ్చి స్తుతి వందనం చేయండి.

అదృష్టం కోసం

  1. పూజా స్థలంలో స్పటిక శివలింగాన్ని ప్రతిష్టించండి.
  2. ఒక పళ్ళెంలో పండ్లు, పూలు, స్వీట్లు సమర్పించి పంచోపచార పద్ధతిలో శివుడిని పూజించండి.
  3. ఎర్రటి దుప్పటి మీద కూర్చుని “ఓం నమో భగవతే వ్యోమరుద్రాయ స్వాహా” అనే మంత్రాన్ని జపించండి.
  4. మంత్రం జపించేటప్పుడు, జపమాల కప్పి ఉంచి హృదయానికి దగ్గరగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి.
  5. ఇలా మంత్రం జపించేటప్పుడు, మీ ముఖాన్ని ఉత్తరం వైపు ఉంచి మంత్రాన్ని 7 సార్లు జపించండి.
  6. మంత్రాన్ని జపించిన తర్వాత, శివుడికి బియ్యంతో చేసే పాయసం ప్రసాదంగా సమర్పించండి. హారతి ఇచ్చి స్తుతించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..