AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేఖ గుప్తాపై దాడి కేసు రెండో నిందితుడి అరెస్టు.. ప్రధాన నిందితుడు ఖిమ్జీ నేర చరిత్ర మూములుగా లేదుగా

ఢిల్లీ సీఎం రేఖ గుప్తా సివిల్ లైన్స్‌లోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన బహిరంగ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో దాడి జరిగింది. దాడికి సంబంధించి ఆటోరిక్షా డ్రైవర్ ఖిమ్జీ (41)ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఖిమ్జీ స్నేహితుడు తహ్సీన్ సయ్యద్‌ను శుక్రవారం రాత్రి గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి ఢిల్లీకి మరింత విచారణ కోసం తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

రేఖ గుప్తాపై దాడి కేసు రెండో నిందితుడి అరెస్టు.. ప్రధాన నిందితుడు ఖిమ్జీ నేర చరిత్ర మూములుగా లేదుగా
Delhi Cm Rekha Gupta
Surya Kala
|

Updated on: Aug 25, 2025 | 8:19 AM

Share

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆదివారం మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని తహసీన్ సయ్యద్‌గా గుర్తించామని, అతను ప్రధాన నిందితుడు సకారియా రాజేష్‌భాయ్ ఖిమ్జీ స్నేహితుడు అని పోలీసు అధికారులు తెలిపారు.

బుధవారం సివిల్ లైన్స్‌లోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రజా విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఆటోరిక్షా డ్రైవర్ ఖిమ్జీ (41)ని అరెస్టు చేశారు. విచారణ కోసం శుక్రవారం రాత్రి గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి తహ్సీన్‌ను రాజధాని ఢిల్లీకి తీసుకువచ్చి ఆదివారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వాస్తవాలను ధృవీకరించడానికి ఖిమ్జీని ప్రశ్నిచారు.

ప్రజా విచారణ కార్యక్రమంలో ముఖ్యమంత్రిపై దాడి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం తహ్సీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఖిమ్జీ రేఖ గుప్తా షాలిమార్ బాగ్ నివాసానికి సంబంధించిన వీడియోను తహ్సీన్‌కు పంపాడని తెలుస్తోంది. అంతేకాదు బుధవారం సివిల్ లైన్స్‌లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రిపై దాడికి ముందు తహ్సీన్.. ఖిమ్జీ కి రూ. 2,000 పంపించినట్లు.. అతనితో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు .. పోలీసుల విచారణలో తహ్సీన్ వెల్లడించాడు.

ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే ముందు సకారియా రాజేష్‌భాయ్ ఖిమ్జీ కూడా సుప్రీంకోర్టుకు వద్దకు వెళ్లాడు. అయితే సుప్రీంకోర్టు వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు ఉండడం చూసి, అతను షాలిమార్ బాగ్ ముఖ్యమంత్రి నివాసానికి తిరిగి వచ్చాడు.

రాజ్‌కోట్‌లో ఖిమ్జీపై అనేక కేసులు నమోదు

2017 నుంచి 2024 మధ్య రాజ్‌కోట్‌లోని భక్తినగర్ పోలీస్ స్టేషన్‌లో ఆటోరిక్షా డ్రైవర్ ఖిమ్జీపై అనేక కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దాడి, మద్యం తాగి ఆటో నడపడం వంటి ఐదు కేసులు నమోదయ్యాయని , అతనిపై అనేక నివారణ చర్యలు కూడా తీసుకున్నామని పోలీసు అధికారి చెప్పారు. గుజరాత్ నిషేధ చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని వివిధ సెక్షన్ల కింద 2017, 2020, 2022లో రెండుసార్లు ఈ చర్యలు తీసుకున్నారు. బాంబే పోలీస్ చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం 2021లో ఒకసారి ఖిమ్జీని నగర బహిష్కరించారు.

2017లో జరిగిన ఒక కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఖిమ్జీ ఒక వ్యక్తి తలపై కత్తితో దాడి చేశాడు. వాషింగ్ బ్యాట్‌తో కూడా కొట్టాడు. 2022లో తన భార్యతో గొడవ పడి.. ఆ తర్వాత కుటుంబ సభ్యులను భయపెట్టడానికి అతను బ్లేడుతో తన తలపై తానే కోసుకున్నాడు. అప్పుడు అతనికి తొమ్మిది కుట్లు పడ్డాయి.

ఖిమ్జీ అక్రమ మద్యం అక్రమ రవాణాలో కేసుల్లో కూడా ప్రధాన నిందితుడు. ఢిల్లీ పోలీసులు రాజ్‌కోట్‌లోని ఖిమ్జీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సహా 10 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, బయటపడిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని అధికారి తెలిపారు.

రాంలీలా మైదానంలో నిరసనకు ప్రణాళిక

సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా నిరసన నిర్వహించినట్లే.. వీధి కుక్కలను తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో నిరసన తెలియజేయాలని తాను ప్లాన్ చేసుకున్నానని ఖిమ్జీ దర్యాప్తు సంస్థలకు తెలిపారు. “అవసరమైతే, దర్యాప్తు కోసం మేము అతనిని రాజ్‌కోట్‌లోని అతని స్వస్థలానికి కూడా తీసుకెళ్లవచ్చు” అని ఒక వర్గాలు తెలిపాయి. దాడికి ముందు అతను ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని తొలగించాడో లేదో తెలుసుకోవడానికి ఖిమ్జీ మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు.

ఖిమ్జీని కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. వీధికుక్కల సమస్యను లేవనెత్తడానికి ముఖ్యమంత్రి ప్రజా విచారణ కార్యక్రమానికి తాను వెళ్లానని అతను పోలీసులకు చెప్పాడు. రాజ్‌కోట్ పోలీసుల ప్రకారం, వీధికుక్కలపై సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొనడానికి ఖిమ్జీ ఆగస్టు 19న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నుంచి ఢిల్లీకి వచ్చాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..