Vedic Story On Kumbha Mela: త్రివేణి సంగమంలో కుంభ మేళా నిర్వహణ వెనుక ఓ ఆధ్యాత్మిక చరిత్ర..
త్రివేణి సంగమంలో ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా.. హిందూ ధర్మం ప్రకారం... ఈ కుంభ మేళా నిర్వహణ వెనుక ఓ ఆధ్యాత్మిక చరిత్ర ఉందని తెలుస్తోంది..

Vedic Story On Kumbha Mela: త్రివేణి సంగమంలో ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా.. హిందూ ధర్మం ప్రకారం.. కుంభమేళా, పురష్కారాల ఇలా వివిధ సందర్భాల్లో నదులను పూజించడం, ఆ నదిలో స్నానమాచరించడం సంప్రదాయంగా జరుగుతూనే ఉంది. తాజాగా 2021 జనవరి 14 నుంచి హరిద్వార్ కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గంగానదిలో స్నానమాచరించడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావిస్తున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. హరిద్వార్ కుంభమేళాకు ప్రత్యేక కొవిడ్-19 అధికారులను నియమించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే హరిద్వార్ నగరాన్ని సుందరంగా అలంకరించారు. అయితే ఈ కుంభ మేళా నిర్వహణ వెనుక ఓ ఆధ్యాత్మిక చరిత్ర ఉందని తెలుస్తోంది.
హర్షవర్ధనుడి కాలంలో భారత దేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ లేక గ్జుయాన్జాంగ్ యొక్క రచనలలో మొదటగా కుంభ మేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేద కాలం నుంచే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉందని కొందరి భావన. ముఖ్యంగా హిందూ పురాణ గాథల్లో, హిందూ సిద్ధాంతాలలో, క్షీర సాగర మధన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహా భారతంలో మరియు రామాయణం లో కుంభ మేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.
ముఖంగా తమ శక్తిని కోల్పోయిన దేవతలు విష్ణు సూచనతో అమృతం కోసం క్షీరసాగర మధనానికి సిద్ధమవుతారు. పాలకడలిని చిలికి అమృతం సంపాదిస్తే.. తమ శక్తిని తిరిగి పొందవచ్చని భావిస్తారు. అయితే అమృత మధనం ఒక్క దేవతల వీలు కాకపోవడంతో.. అమృతం లభించాక చెరి సగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురుల సాయం కోరతారు. క్షీరసాగర మధనంలో అమృతభాడం వెలికి రాగానే దేవతలు, రాక్షసుల మధ్య పోట్లాట మొదలవుతుంది. అలా పన్నెండు రాత్రులు, పన్నెండు పగళ్ళు పాటు.. అంటే మనుషుల దృష్టిలో పన్నెండు సంవత్సరాల పాటు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహా విష్ణువు మోహినిగా మారి ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు.
అందుకనే అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభ మేళాఅని ఓ పురాణ కధనం. సూర్యుడు మరియు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి ఏకకాలంలో సింహ రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభ మేళాను నాసిక్ లోని త్రయంబకేశ్వర్ లోనూ, సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లోనూ, బృహస్పతి వృషభ రాశిలో మరియు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభ మేళాను ప్రయాగ లోనూ, బృహస్పతి మరియు సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహిస్తారు. ప్రతి స్థలం లోను కుంభ మేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు , బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. ఈ కుంభమేళా జరిగే ప్రాంతాల్లోని గంగానదిలో స్నానమాచరిస్తే.. తమ పాపాలు నశించి.. మోక్షం లభిస్తుందని భక్తులు భావిస్తారు.
Also Read:
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. మకరసంక్రాంతి రోజు నుంచి కుంభమేళా ప్రారంభం..




