Vastu tips: పొరపాటున కూడా 4 వస్తువులను అల్మారాలో ఉంచొద్దు.. లేదంటే దరిద్రానికి వెల్కమ్ చెప్పినట్లే!
Vastu tips: వాస్తు శాస్త్రం ఏ వస్తువు ఎక్కడ, ఎలా ఉండాలో చెబుతుంది. ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి? ఉండకూడదో కూడా చెబుతుంది. ఇంటి నిర్మాణంతోపాటు కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే కలిగే అనర్థాలను కూడా వివరిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. బీరువా(Wardrobe)లో పొరపాటున కూడా 4 వస్తువులను ఉంచకూడదు. ఇంట్లోని వారిపై తీవ్ర ప్రభావం చూపించే ఆ 4 వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం అనేక ఇంటి నిర్మాణం, వాస్తు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఏయే వస్తువులు ఎక్కడ, ఎలా ఉండాలనేది చెబుతుంది. ఏయే వస్తువులు ఇంట్లో ఉండాలి, ఉండకూడదు అనే విషయాలను కూడా తెలియజేస్తుంది. సాధారణంగా ప్రతీ ఇంట్లో బీరువా లేదా అల్మారా ఉంటుంది. బీరువాలో ఎలాంటి వస్తువులు ఉంచాలి? ఏ వస్తువులు ఉంచకూడదు అనే విషయాలను కూడా వెల్లడించింది.
వాస్తు శాస్త్రం ప్రకారం అల్మారా/బీరువా(Wardrobe)లో పొరపాటున కూడా 4 వస్తువులను ఉంచకూడదు. ఇంట్లోని వారిపై తీవ్ర ప్రభావం చూపించే ఆ 4 వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెర్ఫ్యూమ్ లేదా కొలోన్లు
అల్మారాలో పొరపాటున కూడా పెర్ఫ్యూమ్స్ లేదా కొలోన్లను ఉంచవద్దు. దీని వల్ల వాస్తు దోషాలు వస్తాయి. మీ అల్మారాలో సువాసనగల పెర్ఫ్యూమ్స్ ఉంటే.. అది మీ సంపదను వృథా చేస్తుంది. అంతేగాక, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
అద్దం
మీరు వార్డ్‌రోబ్‌కు అద్దం ఉంచినా లేదా దానిలో అద్దం అమర్చినా.. వాస్తు దోషాలను కలిగిస్తుంది. అద్దం ఉన్న బీరువా చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఆర్థిక సమస్యలు, పేదరికానికి దారితీస్తుంది.
చిరిగిన లేదా వ్యర్థమైన కాగితాలు
సిరి సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి అల్మారాలో లేదా సేఫ్‌లో నివసిస్తుంది. కాబట్టి, చిరిగిన లేదా వ్యర్థమైన కాగితాలను అల్మారాలో ఉంచకుండా ఉండండి. ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది. దీంతో ఆర్థిక సమస్యలు కలుగుతాయి.
నల్లటి దుస్తులు
వాస్తు ప్రకారం నల్లటి దుస్తులను కూడా అల్మారాలో ఉంచవద్దు. నల్లటి పర్స్ లేదా నల్లటి బ్యాగ్ వంటి నల్లటి వస్తువులను కూడా అల్మారాలో ఉంచవద్దు. అలాగే డబ్బును నల్లటి గుడ్డలో ఎప్పుడూ ఉంచకూడదు. ఇది సంపదను కోల్పోవడానికి దారితీస్తుంది. అంతేగాక, ఆనందానికి దారితీసే మార్గాన్ని అడ్డుకుంటుంది.
Note: ఈ వార్తలోని సమాచారం వాస్తు శాస్త్రం, మతపరమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.
