Vastu Tips: మీ ఇంట్లో ఈ వస్తువులుంటే సంతోషం కరువే .. ఈ వస్తువులున్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి..

Vastu Tips:ప్రసుత్తం అందమైన ఇల్లు ఓ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. తమ స్టేటస్ ను తమ ఇష్టాలను పదిమందికి ప్రదర్శించుకునే వేదికగా ఇల్లు మారిపోయింది. అందుకనే ఇంటిని ఇంట్లోని వస్తువులను అందంగా కనిపించేలా..

Vastu Tips: మీ ఇంట్లో ఈ వస్తువులుంటే సంతోషం కరువే .. ఈ వస్తువులున్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి..
Vastu Tips
Follow us

|

Updated on: Sep 18, 2021 | 3:51 PM

Vastu Tips:ప్రసుత్తం అందమైన ఇల్లు ఓ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. తమ స్టేటస్ ను తమ ఇష్టాలను పదిమందికి ప్రదర్శించుకునే వేదికగా ఇల్లు మారిపోయింది. అందుకనే ఇంటిని ఇంట్లోని వస్తువులను అందంగా కనిపించేలా అలంకరించుకుంటున్నాడు.  ఆర్ధికంగా ఉన్నవాళ్ళు అయితే.. ఇలా ఇంటికి అలంకరించుకోవడానికి దానిని మెయింటైన్ చేయడానికి ఓ మనిషిని పెట్టుకుంటున్నారు. ఇంటిలో అందమైన వస్తులు, బొమ్మలు. దేవుడి విగ్రహాలు, మనసుకు ఆహ్లదకరం అనిపించే సీనరీలు, ఇలా తమ అభిరుచికి అద్దంపట్టేలా ఇంటిని అలంకరించుకుంటున్నారు.  ఇలా ఇంటిని అలంకరించుకోవడానికి ఉన్నవాళ్లు అయితే ఏకంగా ప్రత్యేక నిపుణులని సైతం తెప్పించుకుని ఇంటిని అందంగా డెకరేట్ చేయించుకుంటారు. వీటికోసం లక్షల్లో డబ్బుని ఖర్చుపెడతారు. అంత ప్రాధాన్యత చూపిస్తారు ఇంటి అలంకరణ కోసం. అయితే కంటికి ఇంపుగా అందంగా కనిపిస్తున్నాయి కదా అని ఏ వస్తవులు బడితే ఆ వస్తువులు, సీనరీలు, అలంకరించకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కొన్ని వస్తువులు ఇంట్లో ఉండకూడదని.. అలా ఉంచితే.. ఆ ఇంటిలోని సభ్యుల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చుపిస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకనే ఇంట్లో అందం కోసం ఏర్పటు చేసే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో.. ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ వహించాలంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇల్లు అందంగా కనిపించాలని కనిపించిన కనిపించిన ప్రతి వస్తువునీ తెచ్చి పెట్టుకోవడం వల్ల అనవసర తలనొప్పులను కోరి తెచ్చుకోవడమే అంటున్నారు. వీటివల్ల అనేక రకాల కుటుంబ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అసలు ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటి.? వాటివల్ల మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి.? తెలుసుకుందాం..

*ఇంట్లో విరిగిపోయిన, పగిలిపోయిన బొమ్మలు , అద్దం ఉండకూడదు. కొంత మంది పగిలిన విరిగిన బొమ్మలను బహుమతిగా వచ్చాయనే .. వాటి పైన ఉన్న ఇష్టం వల్లనో  విరిగిన బొమ్మలను పడెయ్యారు. తీపి జ్ఞాపకాలంటూ ఇంట్లోనే ఉంచుకుంటారు. అయితే ఇలాంటి వస్తువులని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సమస్యలు రెట్టింపవుతాయి. మానసిక అశాంతి, ఇంట్లో గొడవలు వంటివి తలెత్తుతాయి.

*ఇంట్లోని నీరు వృధాగా పోయే పరిస్థితులను ఉపేక్షించకూడదు. టాప్ నుంచి నీరు లీక్ అవుతుంటే ఆ ఇంట్లో ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. ధన వ్యయం పెరుగుతుంది. వ్యాపారంగలో అనుకోని నష్టాలు సంభవిస్తాయి. అందుకే కిచెన్‌లోనో, బాత్‌రూమ్‌లోనో ఇలా ఎక్కడైనా ఇంట్లో లీక్ అయ్యే వాటర్ టాప్స్ ఉంటే వాటిని వెంటనే రిపేర్ చేయించుకోండి. నీరు వృధా కాదు.. డబ్బూ పోదు.

అన్నిటికన్నా ముఖ్యంగా.. ఇంట్లో ఆగిపోయిన, పాడైపోయిన, పగిలిపోయిన గడియారాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటె వెంటనే వాటిని అక్కడినుండి తీసివేయాలి. వాటిని రిపేర్ చేయించడమో లేదా బ్యాటరీలు మార్చాడం వంటివి చేయాలి. అది రన్నింగ్ కండిషన్‌‌లో ఉంటేనే ఇంట్లో ఉంచండి లేదంటే పడేయండి. పనిచేయని గడియారాలు ఇంట్లో ఉండటం వల్ల జీవితంలో ఎదుగుదల ఉండదు.

*కొంతమంది సముద్రాలు, పడవలు, ఓడలు వంటివి కూడా సీనరీ బాగుందని ఇంట్లో గోడలకి తగిలిస్తారు. టైటానిక్ మూవీపైన ఉన్న ఇష్టంతో కూడా మునిగిపోతున్న ఆ పడవ ఫోటోలు పెట్టుకుంటారు. కాని మునిగిపోయే పడవలు ఉండే ఫొటోస్ గాని, బొమ్మలు గాని ఇంట్లో ఉండకూడదు. ఇలాంటి బొమ్మలు ఇంట్లో ఉంటే కుటుంబ సమస్యలు ఎక్కువవుతాయి.

పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కుడా పాతవి ఉంచకూడదు. అంటే.. ఆ ఫోటోలు పూజ గదిలో చాలా రోజులుగా ఉండి, దేవుడి రూపం కూడా కనిపించనంతగా మారిపోయి ఉన్న పటాలు పూజ గదిలో ఉంచడం మంచిదికాదు. కొంత మంది విరిగిపోయిన దేవుని విగ్రహాలని కూడా పూజ గదిలో ఉంచి వాటికి పూజలు చేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదు. పాత దేవుని చిత్ర పటాలు, విగ్రహాలు ఉంటే వాటిని దగ్గరలో ఉన్న ఆలయంలో ఇచ్చెయ్యాలి. లేదా వాటిని పారే నదిలో కలిపివేయాలి.

*అందంగా అమాయకంగా ఉండే చిన్నపిల్లలను.. ఫోటోలను ఇష్టపడనివారు బహు అరుదు.. చాలా మంది అందంగా ఉన్నారని చిన్న పిల్లల ఫోటోలను ఇంట్లో గోడలకి పెట్టుకుంటారు. నవ్వుతున్న పిల్లల ఫోటోలు పెట్టుకుంటే ఫరవాలేదు.  అయితే కొంత మంది ఏడ్చే పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు. ఇలా.. ఏడుస్తున్న పిల్లల ఫోటోలు కూడా ఇంట్లో ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో ఆడవాళ్ళు తరుచుగా అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది.

*క్రూరమృగాల బొమ్మలు, యుద్ద సన్నివేశాన్ని ప్రతిబింబించే ఫోటోలు వంటివి కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. వీటివల్ల నెగిటివ్ ఎనర్జీ పుడుతుందట. అంతేకాదు ఇంట్లో అశాంతి తలెత్తుతుంది.వీటి బదులుగా అందంగా ఉండే ఫ్లవర్స్, నేచర్ గ్రీన్ సినరీ, వాటర్ ఫాల్స్ వంటి చిత్ర పటాలు, బుద్దుని బొమ్మలు పెట్టుకోవడం చాలా మంచిది. వీటి వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి.. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఇక ఇంటిని అలంకరించుకోవడానికి చాలా మంది ప్లాస్టిక్ పువ్వుల మొక్కలను ఆశ్రయిస్తారు. వీటి బదులు వీలయితే ఇండోర్ ప్లాంట్స్.. మనీ ప్లాంట్, లక్కీ ప్లాంట్ వంటివి అందమైన గాజు సీసాలో పెట్టుకుని అలంకరించుకుంటే.. ఇంటిలో అందానికి అందం.. కళ్ళకు ఆరోగ్యం. లభిస్తుంది. ఇల్లు అలంకరించుకునేవారు ఈ సింపుల్ విషయాలను తెలుసుకుని.. పాటిస్తే.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎల్లప్ప్పుడూ ఆనందంగా సుఖ సంతోషలతో జీవిస్తారట.

Read Also: Donations(Dana): దాన గుణంలో అభినవ కర్ణులే.. ధాతృత్వంలో ప్రపంచంలో మేటి ఏ దేశస్థులంటే?