Vastu Tips: పొరపాటున కూడా ఈ 4 వస్తువులు వేరొకరి దగ్గరి నుంచి అరువు తీసుకోకండి..
రోజూ మన నుంచి ఎన్నో వస్తువులు చేతులు మారుతుంటాయి. మనకు తెలియకుండానే మనం ఎదుటివారి నుంచి వారి ఎనర్జీని కూడా గ్రహిస్తుంటాం. నెగిటివ్ ఎనర్జీ వల్ల అది మన ఆరాను ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే అపరిచిత వ్యక్తులకు నమస్కారం చేయడం షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వంటి సంప్రదాయం మన దేశంలో ఎప్పటినుంచో ఉంది. మరి ఏకంగా కొందరు ఇతరులు ఉపయోగించిన వస్తువులనే తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోకూడని ఈ 4 వస్తువుల గురించి తెలుసుకోండి..

సాటి మనిషికి సాయం చేయడం.. అవసరమైతే వారి నుంచి సాయం తీసుకోవడం ఎంతో ముఖ్యమైన విధి. కానీ ఈ సాయం రూపంలో కొన్ని వస్తువులను అరువు తెచ్చుకోవడం చేస్తుంటారు కొందరు. కానీ జోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను ఎవరి దగ్గరా అప్పుగా తీసుకోకూడదట. అలా అప్పుగా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ శాస్త్రం చెబుతోంది. దీని వల్ల ఇతరుల నుంచి ఎనర్జీ ట్రాన్స్ ఫర్మేషన్ జరుగుతుందని దాని కారణంగా ఎన్నో ఆ వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం..
వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని వస్తువులు ఒక వ్యక్తి నుండి మరొకరికి ప్రతికూలతను బదిలీ చేస్తాయి. ఇది దురదృష్టానికి కారణమవుతుంది. ఇతరుల బట్టలు ధరించడం వల్ల ఒకరి ప్రతికూల శక్తి మరొకరికి బదిలీ అవుతుంది. బట్టలలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం ఫంక్షన్లు, పార్టీల సమయంలో ఎవరైనా బంధువులు, ఫ్రెండ్స్ దగ్గర బట్టలను అరవుగా తీసుకుంటాం. ఆ తర్వాత వారికి తిరిగి ఇచ్చేస్తుంటాం. కానీ… ఆ పొరపాటు చేయకూడదని .జోతిష్యశాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల.. మీలో ఉన్న పాజిటివీ ఎనర్జీ పోయి… మీరు ఎవరి దుస్తులు వేసుకుంటున్నారో వాళ్ల నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దురదృష్టం వెంటాడుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఒకరికొకరు వస్తువులను పంచుకోవడం లేదా అవసరమైనప్పుడు అడగడం మంచి అలవాటు కావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో, ఇది ఖరీదైనది కావచ్చు. కామన్ గా మనం చేసే మరో పొరపాటు ఇది. పాదరక్షలు లేదా బూట్లు మార్చుకోవడం కూడా మీకు ఖరీదైనదిగా నిరూపించవచ్చు. శని గ్రహం డబ్బులో నివసిస్తుందని ఒక మత విశ్వాసం ఉంది. నమ్మకాల ప్రకారం, మీరు వేరొకరి బూట్లు లేదా చెప్పులు ధరిస్తే, ఆ వ్యక్తి కష్టాల ప్రభావం మీపై కూడా పడుతుందట.
మన దగ్గర రెండు పెన్స్ ఉన్నాయి అంటే.. వెంటనే ఎవరైనా అడిగితే ఇచ్చేస్తూ ఉంటాం. కానీ.. ఆ పొరపాటు కూడా చేయకూడదని జోతిష్యశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే.. పెన్ అనేది నాలెడ్జ్ కి సంబంధించిన విషయం… దీనిని ఎవరికైనా ఇవ్వడం వల్ల… మీకు ప్రొఫెషనల్ గా, వృత్తి పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఇతరులతో షేర్ చేయకపోవడమే మంచిది.
వేరొకరి ఉంగరాన్ని ధరించకూడదు. ప్రతి రత్నం లోహం దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అవి వ్యక్తి యొక్క గ్రహాలు నక్షత్రాలకు సంబంధించినవి. వాస్తు శాస్త్రం ప్రకారం, వేరొకరి గడియారం ధరించడం వల్ల వారి మంచి చెడు సమయాల్లో మీపై ప్రభావం చూపుతుంది.