Unique Shiva Temple: ఈ శివాలయం వెరీ వెరీ స్పెషల్.. ఒకే చోట స్వస్తిక రూపంలో 525 శివలింగాలు.. ఎక్కడంటే
రాజస్థాన్‌లోని కోటా నగరం విద్య, పారిశ్రామిక రంగంతో గుర్తింపుని సొంతం చేసుకోవడమే కాదు.. ఇక్కడ ఉన్న ఒక శివాలయం ఆధ్యాత్మికంగా ఈ నగరం ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఈ శివాలయం విశ్వాసం, భక్తికి ఒక ప్రత్యేక కేంద్రంగా మారింది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాదు ఉత్తరాదివారు శ్రావణ మాసంలో శివుడిని పుజిస్తారు. ఈ నేపధ్యంలో ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి? ఎందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ శివాలయం శివ భక్తులను ఆకర్షిస్తుంది తెలుసుకుందాం..

దక్షినాది వారు ముఖ్యంగా తెలుగువారు కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే.. ఉత్తరాదివారు శ్రావణ మాసంలో శివుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పుజిస్తారు. శ్రావణ మాసం మొదలు కాగానే అక్కడ వాతావరణం మొత్తం శివ మయం అవుతుంది. శివుని భక్తిలో మునిగిపోతారు. శివాలయాలను దర్శిస్తారు. ఈ నేపధ్యంలో ఈ రోజు మన దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని వందల శివలింగాలు ఉన్న శివాలయం గురించి తెలుసుకుందాం.. రాజస్తాన్ లోని కోటలోని శివపురి ధామ్ శివ భక్తులకు అత్యంత దర్శనీయ స్థలం. ఎందుకంటే ఈ ఆలయం 525 శివలింగాలను కలిపి ప్రతిష్టించిన అద్భుతమైన ఆలయం. శివుడిని సందర్శించి.. శివలింగాన్ని ప్రతిష్టించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ ఆలయం దాని 525 శివలింగాల కారణంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయం తర్వాత… ఇంత భారీ సంఖ్యలో శివలింగాలను కలిపి ప్రతిష్టించిన ఏకైక ఆలయం ఇదే. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి , శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు శివయ్యను దర్శనం చేసుకుని అభిషేకం చేయడం కోసం దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ఈ రోజు ఈ ఆలయం పౌరాణిక చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
దేశంలోనే ఒక ప్రత్యేకమైన ఆలయం శివపురి ధామ్ లోని ప్రత్యేకత ఏమింటే ఇక్కడ ప్రతిష్టించబడిన 525 శివలింగాలు. ఇంత భారీ సంఖ్యలో శివలింగాలు ఉన్న ప్రదేశాలు రెండే ఉన్నాయట. ఒకటి నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం. మరొకటి కోటలోని శివపురి ధామ్. ఈ 525 చిన్న శివలింగాలను ఒక భారీ స్వస్తిక రూపంలో ప్రతిష్టించారు. ఈ గొప్ప నిర్మాణం మధ్యలో దాదాపు 14 టన్నుల బరువున్న ఒక భారీ శివలింగం కూడా ఉంది. ఇది అద్భుతమైన వాస్తుశిల్పం, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రత్యేకమైన సంగమాన్ని అందిస్తుంది.
ప్రాచీన చరిత్ర, రాజకుటుంబం సహకారం శివపురి ధామ్ చరిత్ర కూడా చాలా పురాతనమైనది. గతంలో ఒకే ఒక పురాతన ధున (చిన్న ఆలయం) ఉండేదని చెబుతారు. ఇది సుమారు 800 సంవత్సరాల పురాతనమైనదని నమ్ముతారు. కోట రాజకుటుంబానికి ఈ ధున చుట్టూ భూమి ఉంది. వారు తమ భూమిని ఆలయ అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాతే ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం సాధ్యమైంది.ఇది నేడు లక్షలాది మంది భక్తుల విశ్వాస కేంద్రంగా ఉంది.
శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత శ్రావణ మాసంలో శివపురి ధామ్ అందాలను చూడాల్సిందే అంటారు ఎవరైనా. తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తుల రద్దీ మొదలవుతుంది. శివుని దర్శనం,అభిషేకం కోసం దూర ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వస్తారు. అంతేకాదు ప్రతి శివరాత్రి రోజున ఇక్కడ ఒకేసారి 525 శివలింగాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింపజేస్తుంది.
కోరిక నెరవేరుతుందనే నమ్మకం ఈ అద్భుతమైన శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది. నిర్మలమైన హృదయంతో చేసే అభిషేకం శివుడిని సంతోషపరుస్తుందని, భక్తుడు కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తుందని భక్తులు నమ్ముతారు. కోటలోని శివపురి ధామ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. విశ్వాసం, చరిత్ర,ప్రత్యేకమైన వాస్తుశిల్పానికి సజీవ చిహ్నం. దేశంలోని ప్రధాన అధ్యతిక ప్రదేశాలలో ఈ ప్రదేశానికి ఖచ్చితంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








