TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టిక్కెట్లు విడుదలయ్యేది ఆ రోజే.. బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం, సప్తగిరులపై కొలువైన వైకుంఠవాసుడిని కనులారా దర్శించుకోవాలని సమస్త భక్తకోటి అనుకుంటుంటారు. తమ ఇష్ట దైవాన్ని కళ్లారా చూసి తరించాలని పరితపిస్తుంటారు. అయితే తిరుమల కొండపై..

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టిక్కెట్లు విడుదలయ్యేది ఆ రోజే.. బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
Tirumala Srivari Temple
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 19, 2022 | 3:28 PM

కలియుగ ప్రత్యక్ష దైవం, సప్తగిరులపై కొలువైన వైకుంఠవాసుడిని కనులారా దర్శించుకోవాలని సమస్త భక్తకోటి అనుకుంటుంటారు. తమ ఇష్ట దైవాన్ని కళ్లారా చూసి తరించాలని పరితపిస్తుంటారు. అయితే తిరుమల కొండపై రద్దీ ఉండటం, దర్శన వేళల్లో మార్పులతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ పలు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 న నవంబర్ నెల కోటా టిక్కెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటలకు వెబ్ సైట్ లో రూ.300 దర్శన టికెట్లు ఉంచుతామని తెలిపింది. అక్టోబర్ నెల అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 22న ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. మరోవైపు.. ఈ నెల 27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరగనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తుల కోసం తిరుమలలో అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం, రాత్రి సమయంలో అన్నదాన కేంద్రాల్లో, క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు కూడా ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలూ తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో అన్నదానం చేస్తామంటూ భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ అయింది. టీటీడీ ఆధ్వర్యంలోనే భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

27 నుంచి తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. రోజుకు 95 వేల నుంచి లక్ష మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 నుంచి 19 గంటల్లోగా శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..