TTD Seva Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల.. అందుబాటులో రూ.300 దర్శన టోకెట్లు

శ్రీవారి వర్చువల్‌ ఆర్జిత సేవలను బుక్‌ చేసుకున్న భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శనివారం టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది.

TTD Seva Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల.. అందుబాటులో రూ.300 దర్శన టోకెట్లు
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 07, 2021 | 11:36 AM

TTD Seva Tickets in Online: తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కోటా విడుదల అయ్యింది. శ్రీవారి వర్చువల్‌ ఆర్జిత సేవలను బుక్‌ చేసుకున్న భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శనివారం టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. ఆగస్టు 17, 18, 19, 20వ తేదీలతోపాటు 30, 31వ తేదీలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను రిలీజ్ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ‘tirupatibalaji.ap.gov.in’ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఉదయం 11 గంటలకు టికెట్లను టీటీడీ విడుదల చేసింది.

ప్రతినెలా చివరి వారంలో ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల చేస్తారని తెలిసిందే. స్వామివారి కల్యాణోత్సవం టిక్కెట్లు కలిగిన భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తారు. కాగా భక్తుల రద్ధీ దృష్ట్యా వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ శనివారం విడుదల చేసింది. మరోవైపు, తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు టీటీడీ నిబంధనలతో పాటు, కోవిడ్ రూల్స్ కూడా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also… Sugar Detox: షుగర్ డిటాక్స్‌తో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?.. తెలియకపోతే ఇప్పుడే తెలుసుకోండి.. హెల్తీగా ఉండండి..

SBI: ఎస్‌బీఐలో ఖాతా తెరవాలంటే హామీదారు సంతకం అవసరమా..? కస్టమర్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన బ్యాంకు