TTD: భక్తులకు అలర్ట్.. మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. వివరాలివే..
TTD News: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చూసుకుంటుంది. భక్తుల కోసం కొత్త కొత్త సేవలు ప్రారంభించడం, సదుపాయాలు కల్పిస్తూ భక్తుల మన్ననలు చూరగొంటుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చూసుకుంటుంది. భక్తుల కోసం కొత్త కొత్త సేవలు ప్రారంభించడం, సదుపాయాలు కల్పిస్తూ భక్తుల మన్ననలు చూరగొంటుంది. దూపం స్టిక్స్, గంధం వంటి పూజా సామాగ్రిని, ఇతర రకరకాల వస్తువులను విక్రయిస్తున్న టీటీడీ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో కాపర్, స్టీల్ వాటర్ బాటిళ్ల విక్రయాలను ప్రారంభించింది. భక్తుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ బాటిళ్ల విక్రయం చేపట్టినట్లు టీటీడీ తెలిపింది.
తిరుమలలో అందుబాటులో ఉన్న ఈ బాటిళ్ల ధరలు కూడా ప్రకటించింది టీటీడీ. కాపర్ బాటిల్ ధర రూ. 450, స్టీల్ బాటిల్ ధర రూ. 200 గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ బాటిళ్లను పద్మావతి విచారణ కార్యాలయంలో విక్రయిస్తున్నారు. భక్తుల స్పందన ఆధారంగా తిరుమలలోని అన్ని సబ్ ఎంక్వైరీ కార్యాలయాల్లో విక్రయాలు ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..