Tirumala: శ్రీవారి సేవకులుగా అన్యమతస్తులకు అవకాశంపై పరిశీలిస్తామన్న ఈవో ధర్మారెడ్డి

తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రంలో అన్యమతస్థులు అడుగు పెట్టాలంటే కొన్ని నియమ నిబంధనలున్నాయన్న సంగతి తెలిసిందే.. తాజాగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తిరుమల శ్రీవారి సేవ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి సేవకు అన్యమతస్తులకు అనుమతించాలన్న భక్తుల డిమాండ్ ను పరిశీలిస్తామని ధర్మారెడ్డి చెప్పారు.

Tirumala: శ్రీవారి సేవకులుగా అన్యమతస్తులకు అవకాశంపై పరిశీలిస్తామన్న ఈవో ధర్మారెడ్డి
Ttd Eo Dharma Reddy
Follow us

| Edited By: Surya Kala

Updated on: Feb 02, 2024 | 1:00 PM

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం శీవారి కలియుగ వైకుంఠ నివాసం గా భక్తులు భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటాడు. అలనాటి రాజులు నుంచి నేటి సెలబ్రెటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, దేశాధి నేతలు సహా  వెంకటాచలపతి దర్శనం కోసం తహతహలాడతారు. అయితే ఈ క్షేత్రంలో అన్యమతస్థులు అడుగు పెట్టాలంటే కొన్ని నియమ నిబంధనలున్నాయన్న సంగతి తెలిసిందే.. తాజాగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తిరుమల శ్రీవారి సేవ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి సేవకు అన్యమతస్తులకు అనుమతించాలన్న భక్తుల డిమాండ్ ను పరిశీలిస్తామని ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి సేవ చేసేందుకు ఇతర మతాలకు చెందిన వారికి ఆఫ్ లైన్ ద్వారా అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తామన్నాని తిరుమల అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో  ప్రకటించారు. నాయుడుపేటకు చెందిన ఒక ముస్లిం భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

అంతేకాదు ఫిబ్రవరి 16 న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఒకే రోజు మలయప్పస్వామి సూర్యప్రభ మొదలు 7 వాహనాలపై భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. నాలుగు మాడ వీధుల్లో ఉండే భక్తులకు పాలు అల్పాహారం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు రేపటి నుంచి తిరుమలలో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. 57 మంది పీఠాధిపతుల సలహాలు సూచనలు తీసుకొని హిందూ ధర్మ ప్రచారం చేస్తామన్నారు ఈఓ ధర్మారెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ