Tirumala: బ్రహోత్సవాల్లో అన్నప్రసాద వితరణపై TTD క్లారిటీ.. వారికి విరాళాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి..

తిరుమల బ్రహ్మోత్సవాలంటే వెంకటేశ్వర స్వామి భక్తులకు సందడే.. సందడి.. బ్రహోత్సవాల సమయంలో స్వామి వారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే..

Tirumala: బ్రహోత్సవాల్లో అన్నప్రసాద వితరణపై TTD క్లారిటీ.. వారికి విరాళాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి..
Annadanam In Tirumala
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 19, 2022 | 8:36 AM

Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలంటే వెంకటేశ్వర స్వామి భక్తులకు సందడే.. సందడి.. బ్రహోత్సవాల సమయంలో స్వామి వారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం తిరుమలలో అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.మద్యాహ్నం, రాత్రి సమయంలో అన్నదాన కేంద్రాల్లోనే కాకుండా.. క్యూలైన్లో వేచిఉండే భక్తులకు కూడా ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో అన్నదానం చేస్తామంటూ భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు టీటీడీ దృష్టికి రావడంతో దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పందించారు. తిరుమలలో ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ఆధ్వర్యంలోనే భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు స్పష్టంచేశారు దేవస్థానం అధికారులు. అన్నదానం పేరిట ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు విరాళాలు అడిగితే ఇవ్వొద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో అన్నదానం చేస్తామంటూ సికింద్రాబాద్‌కు చెందిన ఓ ట్రస్టు.. భక్తుల నుంచి విరాళాలు కోరడాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఇందుకోసం బ్యాంక్‌ ఖాతా నంబరు ట్రస్టు అందుబాటులో ఉంచిందని వివరించింది.

ట్రస్టుతో TTDకి ఎటువంటి సంబంధం లేదని, ఇలాంటి సంస్థలు, వ్యక్తుల మాటలు నమ్మొద్దని భక్తులను కోరింది. అక్రమంగా విరాళాలు సేకరించే ట్రస్టులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాగా సెప్టెంబ‌రు 26వ తేదీ రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. 27 నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 95 వేల నుంచి లక్ష మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులకు 18 నుంచి 19 గంటల్లోగా శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. అన్నప్రసాద వితరణ కోసం తరిగొండ వేంగమాంబ అన్నదానసత్రంతోపాటు బయట అన్నదాన ప్రసాద కేంద్రాలను భక్తులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలోనూ అన్నప్రసాదం అందిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..