Makar Sanranti 2022: అక్క ఇంట్లో తన ఫ్యామిలీతో భోగి సంబరాలను జరుపుకున్న నందమూరి బాలకృష్ణ.. భారీగా చేరుకున్న ఫ్యాన్స్..

Makar Sanranti 2022:  తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో జరుపుకోవడానికి అందరు ఆసక్తిని చూపిస్తారు. తమ సొంత ఉరికి తమ..

Makar Sanranti 2022: అక్క ఇంట్లో తన ఫ్యామిలీతో భోగి సంబరాలను జరుపుకున్న నందమూరి బాలకృష్ణ.. భారీగా చేరుకున్న ఫ్యాన్స్..
Balakrishna Bhogi Celebrations
Follow us
Surya Kala

|

Updated on: Jan 14, 2022 | 9:04 AM

Makar Sanranti 2022:  తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో జరుపుకోవడానికి అందరు ఆసక్తిని చూపిస్తారు. తమ సొంత ఉరికి తమ వారిదగ్గరకు చేరుకుంటారు. తాజాగా ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు ప్రకాశం జిల్లలో భోగి సంబరాలను జరుపుకున్నారు.

జిల్లాలోని కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఏడాది భోగి సంబరాలను బాలకృష్ణ తన భార్య వసుంధరతో కలిసి అక్క బావ దగ్గుబాటి పురందరేశ్వరి, వెంకటేశ్వరరావుల ఇంట్లో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు. ఈ ఏడాది భోగి పండగను తన అక్క ఇంట్లో జరుపుకోవడం కోసం బాలకృష్ణ తన భార్య తో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ, మరికొంత మంది దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా గురువారం కారంచేడుకు చేరుకున్నారు.బాలకృష్ణను చూడడానికి స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపధ్యంలో ఇంటిలోపలకు ఎవరిని అనుమతించలేదు.

Also Read:

 కడప జిల్లాలోని బంధువుల ఇంట్లో సందడి చేసిన రోజా.. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలను వేసిన ఎమ్మెల్యే

తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వర్ణరథంపై ఊరేగిన స్వామివారు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో