Makara Sankranti 2022: కడప జిల్లాలోని బంధువుల ఇంట్లో సందడి చేసిన రోజా.. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలను వేసిన ఎమ్మెల్యే
Makara Sankranti 2022: తెలుగువారి లోగిళ్ళలో సంక్రాంతి పండగను సందడి మొదలైంది. పల్లెలు తెల్లవారుజామునే భోగి మంటల కాంతితో వెలుగులు నింపుతున్నాయి. భోగి పండగను తెల్లవారుఝామున..
Makara Sankranti 2022: తెలుగువారి లోగిళ్ళలో సంక్రాంతి పండగను సందడి మొదలైంది. పల్లెలు తెల్లవారుజామునే భోగి మంటల కాంతితో వెలుగులు నింపుతున్నాయి. భోగి పండగను తెల్లవారుఝామున స్నానాలు చేసి భోగి మంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువులు వేస్తారు. తమకున్న అరిష్టాలను తొలగించాలని అందరూ భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటూ.. ఆ మంటల వేడికి చలిని తీర్చుకుంటూ చిన్న పెద్ద సంబరాలు చేసుకుంటారు. ఈ నేపధ్యంలో కడప జిల్లాలో సినీ నటి నగరి ఎమ్మెల్యే రోజా సందడి చేశారు.
ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లాలోని సంబేపల్లి మండలం శెట్టిపల్లి లో భోగి పండగను జరుపుకుంటున్నారు. సంక్రాంతి పండగను జరుపుకోవడానికి రోజా శెట్టిపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లారు . ఈ రోజు తెల్లవారు జామునే తన కుటుంబసభ్యులు , బంధువులతో కలిసి భోగిమంటలు వేశారు. తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు చెప్పారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని పల్లెల్లోని ప్రతి వీధి భోగి మంటలతో నిండిపోయింది. పిల్లలు పెద్దలు సందడి చేస్తున్నారు. ఈ సంవత్సరంలో నైనా ప్రజలంతా వైరస్ బారినుండి విముక్తి పొందాలని కోరుకుంటూ భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. గంగిరెద్దులు.. హరిదాసు కీర్తనలతో భోగి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి.
View this post on Instagram
Also Read: