Horoscope Today: ధనం, వ్యాపారం లో ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.. ఆరోగ్యం, వ్యాపార లాభాల కోసం ఏ దేవుని పూజ చేయాలంటే..

ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే...

Horoscope Today: ధనం, వ్యాపారం లో ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.. ఆరోగ్యం, వ్యాపార లాభాల కోసం ఏ దేవుని పూజ చేయాలంటే..
Rashi Phalalu
Follow us
Surya Kala

|

Updated on: Mar 25, 2021 | 6:59 AM

Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో మార్చి 25 గురువారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..! పుట్టిన తేదీ లేకపోతె మీపేరులోని మొదటి అక్షరం ఆధారముగాకూడా కూడా రాశిఫలాలను తెలుకోవచ్చు..

మేష రాశి: ఈ రాశివారు వ్యాపార భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భిన్నమైన ఆలోచనలు కలుగుతుంటాయి. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామివారి పూజ, దర్శనం మేలు చేస్తుంది.

వృషభ రాశి: ఈ రాశివారు గతంలో చేపట్టిన పనులు ఆగిపోయి ఉంటె.. తిరిగి వాటిని ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సామజిక గౌరవాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన మేలు చేస్తుంది.

మిధున రాశి: ఉమ్మడి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి .. తొందరపడి ఎదుటివారిని నిందించే ప్రయత్నం అసలు చేయరాదు. గౌరీశంకర పూజ, దర్శనం శుభఫలితాలను ఇస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు పలురకాల సౌకర్యాలు ఇబ్బందులు గురిచేస్తుంటాయి. ప్రచార సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది.

సింహ రాశి: ఈరోజు రావాల్సిన బాకీలు ఆలస్యం అవుటాయి. వేరువేరు రూపాలల్లో ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టినటువంటి పనులు అధిక శ్రమకు గురవుతారు. ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా జాగ్రత్తగా ఉండాలి. శ్రీరాముని నామస్మరణ మేలు చేస్తుంది.

తులా రాశి: ఈ రాశివారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయోజనాలుంటాయా లేవా అనేటువంటి కొంత సమీక్ష చేసుకోవాలి. గొప్పలకు పోయి దాచుకున్నటువంటి ధనాన్ని అనవసరమైన ఖర్చు చేస్తుంటారు.. ఈ రాశివారు మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: ఈరోజు రాజకీయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిశ్రమైన ఫలితాలు పొందుతారు. గౌరవ మర్యాదలు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారికి దుర్గాసప్తస్లోకి స్త్రోత్ర పారాయణ మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి: వేరువేరు రూపాల్లో ప్రయోజనాలు అందుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ధనం విషయం లో ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వ్యవహరించకూడదు. శివపంచాక్షరీ జపం చాలా శుభఫలితాలను కలుగజేస్తుంది.

మకర రాశి: ఈ రాశివారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ పనులు పూర్తి చేస్తూండండి. అలాగే వచ్చే ఆదాయాన్ని జాగ్రత్తాగా కాపాడుకునే ప్రయత్నం చేస్తుండాలి. శ్రీకృష్ణుడి నామ స్మరణ మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికీ ఆరోజు అభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయం జాగ్రత్తలు తీసుకోవాలి . ఈ రాశివారికి ఆదిత్యహృదయ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు వ్యక్తిగతపరమైనటువంటి కార్యక్రమాల్లో పెద్దవారి సలహాలను, హామీలను తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబపరమైన వ్యక్తుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణాలు చేసే సందర్భాలు కనిపిస్తున్నాయి. శివాలయ దర్శనం, నందీశ్వరుడి పూజ మేలు చేస్తుంది.

Also Read:  ఆసియాలోనే అతిపెద్ద తులిప్ వనం ప్రారంభం.. స్వాగతం పలుకుతున్న 15లక్షల మొక్కలు

పెట్రోల్‌ జీఎస్‌టీ పరిధిలోకి రావాలంటే ఎన్నేళ్లు ఆగాలో తెలుసా.? క్లారిటీ ఇచ్చేసిన బీజేపీ ఎంపీ..