AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Vahana Seva: బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు విశిష్ట స్థానం.. స్వామివారిని దర్శిస్తే భాదల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం

సృష్టి కర్త బ్రహ్మ మొదలు పెట్టిన బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడు. కనుక గరుడ వాహన సేవకు విశిష్ట స్థానం ఉంది. గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి విలకట్టలేనని ఆభరణాలైన..

Garuda Vahana Seva: బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు విశిష్ట స్థానం.. స్వామివారిని దర్శిస్తే భాదల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం
Garuda Vaahana Seva
Surya Kala
|

Updated on: Sep 15, 2022 | 9:39 PM

Share

Srivari Brahmotsavam: కలియుగ ప్రత్యక్ష దైవం.. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కోరిన కోర్కెలు తీర్చే వేంకటాచల నాథుడిని తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మలయప్ప స్వామీ ఇరువురి దేవేరులతో కలిసి  తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాలకు.. వాహనాల్లో ఊరేగే స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకు భక్త జనంతో పోటెత్తుతారు. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజులు పలు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.

అక్టోబర్ 1న  శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజు స్వామివారి వారు  ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిస్తారు.  రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. రాత్రి 7 నుండి గరుడ వాహనలో స్వామివారు తిరు మాడ వీధుల్లో విహరిస్తారు.  రాత్రి స్వామివారు వెలకట్టలేనన్ని ఆభరణాలు ధరించి గరుడ వాహనంలోనూ ఊరేగుతూ భక్తులకు దర్శనిమస్తారు. స్వామి వారి వాహన సేవల్లో అత్యంత కీలకమైనది గరుడ వాహన సేవ గా భక్తులకు భావిస్తారు. ఈ వాహన సేవల్లో పాల్గొనే భక్తులు శ్రీవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతారని, సకల పాపాలు తొలగిపోతాయని. జ్ఞానం లభిస్తుందని భక్తుల  నమ్మకం.

సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైంది గరుడవాహనం. గరుడ వాహనంపై ఊరేగే స్వామి వారిని దర్శించుకుంటే.. ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

సృష్టి కర్త బ్రహ్మ మొదలు పెట్టిన బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడు. కనుక గరుడ వాహన సేవకు విశిష్ట స్థానం ఉంది. గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి విలకట్టలేనని ఆభరణాలైన.. మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను అలంకరిస్తారు.   స్వామి ప్రసన్న వదనుడిగా శ్రీదేవి, భూదేవి లతో కలిసి గరుత్మంతుడిపై ఊరేగుతాడు. కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..