Srivari Brahmotsavas: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ నెల 29 నుంచి అప్పటి వరకూ కొండపైకి ద్విచక్రవాహనాలకు నో ఎంట్రీ..
వీలైనంత వరకూ భక్తులు వాహనాలకు బదులు.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించమని టీడీఏ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 29 వ తేదీ రాత్రి నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 2. గంటల వరకూ ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించరని.. దీనికి ప్రజలు సహకరించగలరని కోరారు.
Srivari Brahmotsavas: కరోనా వైరస్ అనంతరం రెండు సంవత్సరాల తరువాత తిరుపతి క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు. దీంతో భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనావేసి టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులకు అస్కౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ కు సంబంధించి అలిపిరి సహా.. తిరుమలలో 38 పార్కింగ్ స్థలాలలో ఏర్పాట్లు చేశారు. ఈ పార్కింగ్ స్థలాల్లో సుమారు 8000 వాహనాలు ను పార్కింగ్ చేయవచ్చు. తిరుమల రింగ్ రోడ్ వద్ద కూడా వాహనముల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు.
అయితే.. వీలైనంత వరకూ భక్తులు వాహనాలకు బదులు.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించమని టీడీఏ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 29 వ తేదీ రాత్రి నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 2. గంటల వరకూ ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించరని.. దీనికి ప్రజలు సహకరించగలరని కోరారు.
బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం భారీగా పోలీసులను మోహరించినట్లు .. పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తుల రద్దీ పెరగనున్నందున దొంగలు ఇధే అదనుగా భావించి భక్తుల విలువైన వస్తువులు దొంగిలించుకొని వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక తిరుపతి రద్దీ ప్రదేశాల్లో, తిరుమలలో క్రైమ్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు.
అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకోవద్దు. విలువైన వస్తువులను తీసుకుని రావద్దని కోరారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించామని కోరారు. భద్రతలో భాగంగా తిరుమలకు వచ్చు అన్ని దారులలో చెక్ పోస్ట్ లను ఏర్పాట్లు చేశారు. అంతేకాదు TTD.. బ్రహ్మోత్సవాలకు కోసం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కొత్త క్యూ లైన్ లను ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్లల ద్వారా ఎటువంటి తొక్కిసలాట జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరుగాకుండా సహకరించవలెనని కోరారు. దళారుల చేతిలో భక్తులు మోసపోవద్దని టీటీడీ ద్వారానే సమాచారాన్ని పొందవలెనని చెప్పారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..